వందేభారత్‌ స్లీపర్‌లో నో ఆర్‌ఏసీ

వందేభారత్‌ స్లీపర్‌ ఎక్స్‌ప్రెస్‌ 17వ తేదీ నుంచి పరుగులు తీయనుంది. హౌరా-గువాహటి మధ్య నడిచే ఈ రైలుని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.


ఈ మార్గంలో నడిచే ఇతర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పోల్చితే ప్రయాణ సమయం మూడు గంటలు తగ్గుతుంది. రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రారంభమై, తెల్లవారే సరికి గమ్యస్థానం చేరేలా సమయాలను రూపొందించారు. వందేభారత్‌ రైళ్లకు ఆర్‌ఏసీ, వెయిటింగ్‌ లిస్ట్‌, పాక్షిక కన్ఫర్మేషన్‌కు అవకాశం లేదు. వందే భారత్‌ స్లీపర్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ కేవలం కన్ఫర్మ్‌ టికెట్లను మాత్రమే జారీ చేస్తుంది. ఇప్పటి వరకూ అందుబాటలో ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ వంటి ప్రీమియం రైళ్లతో పోల్చితే దీనిలో చార్జీలు కొంచెం ఎక్కువే.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.