Cloves : రోజుకు ఒక్క లవంగం.. ఇదొక అద్భుతం.. దీంట్లోని పవర్ తెలిస్తే విడిచిపెట్టరు..!

www.mannamweb.com


Cloves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి లవంగాలను ఉపయోగిస్తున్నారు. వీటిని తరచూ వంటల్లో వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి.
ఎక్కువగా మాంసాహార, మసాలా వంటకాల్లో లవంగాలను వేస్తుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం లవంగాల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అందువల్ల లవంగాలను తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు.

Cloves
లవంగాలను రోజూ రాత్రి భోజనం చేశాక తినాలి. రాత్రి భోజనం అనంతరం ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని నమిలి మింగాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. లవంగాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్ తగ్గుతాయి. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగాలను రోజూ ఒక్కటి చొప్పున తిన్నా చాలు. షుగర్ లెవల్స్ దెబ్బకు అదుపులోకి వస్తాయి. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి.

లవంగాలను తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు రోజూ ఒక్క లవంగాన్ని నోట్లో వేసుకుని చాలా సేపు చప్పరించి ఆ తరువాత నమిలి మింగాలి. దీంతో నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. దంతాలు, చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. చిగుళ్ల నుంచి కారే రక్తస్రావం తగ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

లవంగాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక వీటిని తింటే క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. అలాగే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఇలా రోజుకు ఒక్క లవంగాన్ని తిన్నా చాలు.. అనేక లాభాలను పొందవచ్చు.