One country..one time :కొత్త ముసాయిదా నిబంధనలు విడుదల

దేశవ్యాప్తంగా ఒకే సమయాన్ని ప్రామాణీకరించే చర్యలో భాగంగా.. ఇక అన్ని రంగాల్లో భారత ప్రామాణిక సమయం (ఐఎస్‌టీ) వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం ముసాయిదా నిబంధనలు రూపొందించింది. వీటిపై వచ్చే నెల 14లోపు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం తూనికలు కొలతలు (భారత ప్రామాణిక సమయం) నిబంధనలు, 2024లో చట్టపరమైన విధివిధానాలు ఏర్పాటు చేశారు. ఇవి అమల్లోకి వస్తే.. చట్ట, పాలన, వాణిజ్య, ఆర్థికరంగాలతో పాటు..అధికారిక పత్రాల్లోనూ ఇక ఐఎస్‌టీ తప్పనిసరి. ఈ చట్టంలోని ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఐఎస్‌టీ కాకుండా ఇతర టైమ్‌ జోన్లను ప్రస్తావించడం నిషేధం. అంతరిక్షం, సముద్రయానం, శాస్త్రీయ పరిశోధన రంగాలకు మినహాయింపునిచ్చింది.