మన మెదడుకు పరీక్ష పెట్టే అనేక రకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తుంటాం. ఈ వీడియోలలో ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజెస్ నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. కొన్ని ఫొటోలు చూస్తే మన కళ్ళను మనమే నమ్మలేనంతగా ఉంటాయి. బాహ్యంగా కనిపించేది ఒక విషయమైతే, అందులో లోలోపే అనేక పజిల్స్ దాగి ఉంటాయి.
ప్రస్తుతం మీ కోసం ఒక ఆసక్తికరమైన ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ తీసుకువచ్చాము. ఈ ఫోటోలో మీరు చూస్తున్న పార్క్ లో ఒక పులి దాగి ఉంది. దాన్ని కేవలం 10 సెకన్లలో గుర్తించడానికి ప్రయత్నించండి.
సోషల్ మీడియాలో ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో (Optical Illusion Viral Photo) చాలా వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో కొంతమంది పిల్లలు ఒక పార్క్ లో ఆడుకుంటున్నారు. అలాగే ఒక మహిళ అక్కడే ఉన్న బెంచ్ పై కూర్చుని ఫోన్ చూస్తుంటుంది. ఆమె పక్కనే ఒక పెంపుడు కుక్క పడుకుని ఉంటుంది. అక్కడ ఉన్న ఒక చెక్క వంతెన పై ఒక బాలుడు పరుగెడుతున్నాడు.
అదే వంతెన పైనుండి ఒక బాలిక జారుడు స్లైడ్ పై జారడానికి ప్రయత్నిస్తుంది. మరో బాలిక వంతెన పైకి వెళ్లడానికి నిచ్చెన ఎక్కుతుంది. అలాగే మరో నలుగురు పిల్లలు వంతెన కింద ఆడుకుంటున్నారు. ఆ పక్కనే ఒక వ్యక్తి తన పెంపుడు కుక్కను తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పార్క్ లో (Park) చాలా చెట్లు కూడా ఉన్నాయి. ఇంకే జంతువు కనిపించడం లేదు.
కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, ఈ పార్క్ లోనే ఒక పెద్ద పులి (Tiger in Hiding) దాగి ఉంది. కానీ ఈ పులిని గుర్తించడం అంత సులభం కాదు. అలాగే అంత కష్టం కూడా కాదు. చాలా మంది ఈ పులిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ కొద్దిమంది మాత్రమే దాన్ని గుర్తించగలుగుతున్నారు.
ఇక్కడే ఆగకండి, మీరు కూడా ఆ పులి ఎక్కడ దాగి ఉందో కనుగొనడానికి ప్రయత్నించండి. ఇంకా కనుగొనలేకపోతే, కింద ఇచ్చిన ఇమేజ్ చూసి సమాధానం తెలుసుకోవచ్చు.