లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. అయితే జీవితంతో పోరాడితే కచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. ఎంతోమంది ఫిలాసఫర్స్ సక్సెస్ అవ్వడానికి వాళ్లకు తోచినవి చెప్పారు. అయితే సక్సెస్ కి సంకల్పం మొదటి బలం. దీనిని గుర్తించడానికి చాలా సమయాన్ని కోల్పోతుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, తన చెల్లి కోసం అన్నయ్య పడే కష్టం చూస్తే బయటి వ్యక్తులు ఇచ్చే మోటివేషన్ మీకు అవసరం ఉండదు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
నెట్ఫ్లిక్స్ (Netflix) లో
ఈ చైనీస్ మోటివేషన్ మూవీ పేరు ‘నైస్ వ్యూ’ (Nice view). 2022లో వచ్చిన ఈ నైస్ వ్యూ అనే మూవీకి వెన్ ముయే దర్శకత్వం వహించారు. చైనీస్ డ్రామా చిత్రం. ఇది వెన్ ముయే దర్శకత్వం వహించిన రెండవ చలన చిత్రం. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో ఒక మొబైల్ షాప్ ని రన్ చేసి బతుకుతూ ఉంటాడు. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. ఆమె ఒక జబ్బుతో బాధపడుతూ ఉంటుంది. డాక్టర్లు చెక్ చేసి ఆపరేషన్ కి చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్తారు. హీరో ఒక చిన్న షాప్ మాత్రమే నడుపుతుంటాడు. ఇతను సంపాదించే డబ్బులు తినడానికి కూడా సరిగ్గా సరిపోవు. ఆపరేషన్ ఎలా చేయాలనుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అతనికి తెలిసిన ఒక వ్యక్తి ఒక విషయం చెప్తాడు. ఒక కంపెనీలో చాలా సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఉన్నాయని, ఇప్పుడు ఆ కంపెనీ దివాలా తీసే పరిస్థితిలో ఉందని చెప్తాడు. ఆ మొబైల్స్ ని నువ్వు కొనుగోలు చేస్తే, నీకు చాలా డబ్బు వస్తుందని చెప్పడంతో హీరో ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఆ ఒక్క మార్గం సక్సెస్ అయితే తన చెల్లికి ఆపరేషన్ తో పాటు తన అప్పులు కూడా తీరిపోతాయి. హీరో ఎలాగో కొంత డబ్బును అరేంజ్ చేసి ఆ సెల్ఫోన్స్ ని కొంటాడు. వాటిని రిపేర్ చేసే క్రమంలో చాలా అవస్థలు పడతాడు.
వాటిలో చాలా ఫోన్స్ పని చేయకుండానే ఉంటాయి. తన తెలివితేటలతో ఆ ఫోన్స్ మళ్లీ పని చేసే విధంగా తయారు చేస్తాడు. చైనాలో సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మడం నేరం గా ఉంటుంది. వాటిలో ఉన్న పార్ట్స్ ని వేరే దేశాలకు అమ్మాలనుకుంటాడు. ఇంతలో ఒక కంపెనీ మేనేజర్ ని కలుస్తాడు. అతడు ఇతని మాటలను పెద్దగా తీసుకోకపోవడంతో హీరో బాధపడతాడు. ఆ తర్వాత ఆ కంపెనీ సీఈవో హీరో పట్టుదల చూసి ఒక అవకాశం ఇస్తాడు. రెండు నెలలు సమయం ఇచ్చి ఈలోగా వర్క్ అవ్వకపోతే డీల్ క్యాన్సిల్ అవుతుందని చెప్తాడు. ఇక హీరో దొరికిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటాడు. చివరికి హీరో ఆ సెల్ ఫోన్స్ ని రిపేర్ చేస్తాడా? అతని చెల్లెలికి ఆపరేషన్ చేయగలుగుతాడా? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి.