బరువు తగ్గే ఆలోచనలో ఉన్నారా? యోగా, ఇతర వ్యాయామంతోపాటు, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార జాగ్రత్తలు, చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు.
వాటిల్లో ముఖ్యమైన ఒక చిట్కా గురించి తెలుసుకుందాం రండి..!
అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నాన బెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగూ కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి మరింత ఉపయోగంగా ఉంటుంది.
బరువుని నియంత్రణలోఉంచడంతోపాటు శరీరంలోని మలినాల్ని బైటికి పంపడంలో నిమ్మరసం ముఖ్యమైన హోం రెమెడీ. విటమిన్ సీ సిట్రిక్ యాసిడ్, కాల్షియం , యాంటీ ఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాల పవర్‌హౌస్ నిమ్మకాయ. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోమెడికల్ అనాలిసిస్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మ కాయల్లోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి.
చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఫైబర్, విటమిన్ బీ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి తాగం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది.
ఎలా తయారు చేసుకోవాలి
ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ చియా సీడ్స్ నానబెట్టాలి. చియా సీడ్స్ చక్కగా ఉబ్బుతాయి.ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వేసి బాగా కలపాలి. కావాలంటే రుచికి పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్‌ను 20 30 నిమిషాల తర్వాత మరోసారి హాయిగా తాగేయడమే. భారీ భోజనం తర్వాత లేదా ఉదయాన్నే కూడా త్రాగవచ్చు. సులభంగా జీర్ణం కావడానికి , వ్యర్థాలను తొలగించేందుకు దీన్ని మించిన డ్రింక్ లేదు.