స్కాట్లాండ్ పేసర్ చార్లీ కాసెల్ (Charlie Cassell) అరంగేట్ర మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో ఫస్ట్ మ్యాచ్‌లోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్- 2 టోర్నీలో సోమవారం ఒమన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో చార్లీ కాసెల్ 5.4 ఓవర్లలో (7/21)తో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ (Kagiso Rabada) తొమ్మిదేళ్ల కిందట నెలకొల్పిన రికార్డును కాసెల్ బ్రేక్ చేశాడు. రబాడ 2015లో బంగ్లాదేశ్‌పై (6/16) గణాంకాలు నమోదు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తన మొదటి ఓవర్‌లోనే చార్లీ కాసెల్ మూడు వికెట్లు పడగొట్టి ఒక్క పరుగూ ఇవ్వలేదు. తొలి బంతికి జీషన్ మక్సూద్‌ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపగా.. తర్వాతి బంతికే ఆర్యన్ ఖాన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. నాలుగో బంతికి ఖలీద్‌ను (క్యాచ్ ఔట్) పెవిలియన్‌కు పంపాడు. ఈ మ్యాచ్‌లో ప్రదర్శన ద్వారా వన్డే అరంగేట్రంలో ఐదు వికెట్లు పడగొట్టిన 15వ బౌలర్‌గా నిలిచాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. చార్లా కాసెల్ దెబ్బకు ఒమన్ 21.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని స్కాట్లాండ్ 17.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనలు (వన్డేల్లో)
చార్లీ కాసెల్- స్కాట్లాండ్ – 7/21 (ఒమన్‌పై, 2024)
కగిసో రబాడ- దక్షిణాఫ్రికా- 6/16 (బంగ్లాదేశ్, 2015)
ఫిడేల్ ఎడ్వర్డ్స్- వెస్టిండీస్- 6/22 (జింబాబ్వే, 2003)
జాన్ ఫ్రైలింక్- నమీబియా- 5/13 (ఒమన్, 2019)
టోనీ డోడెమైడ్- ఆస్ట్రేలియా- 5/21- (శ్రీలంక, 1988)