కుమారుడి ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న అగ్ని ప్రమాదం అనుకున్నా కానీ.. ఇంతలా అవుతుందని అనుకోలేదని బాధపడ్డారు.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులు కాలిపోయాయని వాపోయారు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిందని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
ప్రస్తుతం ఆస్పత్రిలో బ్రంకోస్కోపీ చేస్తున్నారని అన్నారు. దీర్ఘకాలంలో పిల్లాడిపై ఈ ప్రభావం ఉంటుందన్నారు. ప్రమాద తీవ్రత ఇంతలా ఉంటుందని ఊహించలేదని తెలిపారు. పెద్ద కొడుకు పుట్టినరోజే చిన్న కుమారుడికి ఇలా జరగడం దురదృష్టకరమని మీడియా ముందు వాపోయారు.
పవన్ కల్యాణ్ కుమారుడు 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్‌లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు పొగ పీల్చడం వల్ల బాలుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.