ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పేరు SIP. దీన్నే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. పొదుపు చేసుకున్న డబ్బు పెట్టుబడి పెట్టి లాభాలు పొందడానికి ఇదో మార్గం.
ఇందులో ప్రతి నెల నిర్ణీత మొత్తంలో డిపాజిట్ చేస్తూ పోతే.. ఆ డబ్బు క్రమంగా రెట్టింపవుతుంది. మీ డిపాజిట్ పెద్ద ఫండ్‌గా మార్చబడుతుంది. అయితే ఇలా SIP కాకుండా, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి మరో మార్గం ఉంది. అదే లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలంటే SIPతో పాటు లంప్సమ్ కూడా చేయవచ్చు. ఈ రెండూ దేనికవే ప్రత్యేకం. SIPలో నెలనెలా డబ్బు పెడుతూ పోతే, లంప్సమ్ లో ఒకేసారి మొత్తం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలి. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఈ రెండు పద్ధతుల్లో ఏది మంచిదో తెలియక చాలా మంది అయోమయంలో ఉన్నారు. మరి ఈ రెండింటిని కొన్ని పాయింట్లపై పోల్చడం పోల్చి ఏది బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం.
లాభం విషయంలో ఏది బెస్ట్?
మీరు ఒకే కాలానికి పై 2 పద్దతుల ద్వారా ఒకే విధమైన రాబడి ఉన్న మ్యూచువల్ ఫండ్‌లో అదే మొత్తాన్ని పెట్టుబడి పెడితే, అప్పుడు లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభం ఇస్తుంది. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, మొదటి రోజు నుండి మీరు లాభం పొందటం స్టార్ట్ చేస్తారు.
ఉదాహరణ
SIP: నెలవారీ పెట్టుబడి- రూ. 5000, రాబడి అంచనా- 12 శాతం, సమయం- 10 సంవత్సరాలు. ఈ విధంగా మీ మొత్తం డిపాజిట్ మొత్తం రూ. 6 లక్షలు. దీని మీద మీరు 10 సంవత్సరాలలో మొత్తం రూ. 5,61,700 తిరిగి పొందుతారు. డిపాజిట్ మొత్తం, రిటర్న్‌లతో సహా మీ మొత్తం ఫండ్ రూ. 11,61,700.
లంప్సమ్: లంప్సమ్ పెట్టుబడి – రూ. 6 లక్షలు, రాబడి అంచనా- 12 శాతం, సమయం – 10 సంవత్సరాలు. ఈ పద్ధతిలో, మీ మొత్తం డిపాజిట్ మీరు 10 సంవత్సరాల వ్యవధిలో SIPలో డిపాజిట్ చేసినట్లే ఉంటుంది. కానీ ఇక్కడ మొదటి రోజు నుండి 6 లక్షల రూపాయలకు రిటర్న్ వస్తుంది. కాబట్టి 10 సంవత్సరాలకు సాధ్యమయ్యే రాబడి 12,63,500 రూపాయలు. అంటే మీ పెట్టుబడి, రాబడితో కలిపి మొత్తం విలువ రూ.18,63,500 అయింది. అంటే ఏకంగా రూ.7 లక్షల లాభం వచ్చినట్లు.