ఏపీలో పెన్షన్ పండుగ.. 43,665 మందికి రెండు పెన్షన్లు

www.mannamweb.com


డిసెంబర్ నెలకి సంబంధించి.. డిసెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇవాళే పంపిణీ చేస్తోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో.. ఇవాళే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా ప్లాన్ చేసింది.
అందుకే సచివాలయ ఉద్యోగులు ఉదయాన్నే నిద్ర లేవడం ఆలస్యం.. ఇదే పనిలో ఉన్నారు. ఇవాళ వారికి ఉండే టెన్షన్ ఇంకెవరికీ ఉండదు. ఇవాళే అందరికీ పెన్షన్ ఇచ్చేయాల్సి ఉంటుంది. పొరపాటున ఎవరికైనా మిస్సైతే.. మళ్లీ సోమవారమే ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదన్న ప్రభుత్వం ఇవాళే పని పూర్తవ్వాలని ఆదేశించింది. కలెక్టర్లు, ఇతర అధికారులు సైతం.. ఇదే అంశంపై ఫోకస్ పెట్టారు. అందువల్ల ఇవాళ పెన్షన్ పొందేవారు.. ఇళ్లలో అందుబాటులో ఉంటే, ఉద్యోగులకు పని త్వరగా పూర్తవుతుంది.

ఏపీ ప్రభుత్వం దాదాపు 26 రకాల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తోంది. లబ్దిదారుల్లో వృద్ధులు, వితంతువులు, తలసేమియా బాధితులు, ఒంటరి మహిళలు, అభయహస్తం లబ్దిదారులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, చేనేత వారు ఇలా చాలా మంది ఉన్నారు. వీరందరికీ పెన్షన్ ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు 29నే బ్యాంకుల నుంచి మనీ తీసుకున్నారు. అందువల్ల ఇవాళ అన్ని జిల్లాల్లో పెన్షన్ సందడి వాతావరణం కనిపిస్తుంది.

వారికి 2 పెన్షన్లు:
ఏపీలో మొత్తం పెన్షన్ దారులు 64,14,174 మంది ఉండగా.. నవంబర్ నెలకి సంబంధించి 63,70,509 మంది పెన్షన్ పొందారు. ఇంకా 43,665 మంది పొందలేదు. వీరు రకరకాల కారణాలతో పొందలేదు. అందువల్ల ప్రభుత్వం వీరికి డబుల్ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధపడింది. వీరంతా ఇవాళ (నవంబర్ 30) డబుల్ పెన్షన్ పొందుతారు. అందువల్ల వీరు.. సచివాలయ ఉద్యోగులు ఇళ్లకు వచ్చినప్పుడు.. తమకు రెండు పెన్షన్లు ఇవ్వాలని గుర్తుచెయ్యాలి. నవంబర్ నెల పెన్షన్ ఇంకా రాలేదని గుర్తుచెయ్యాలి. అప్పుడు సచివాలయ ఉద్యోగులు అది గమనించి, రెండు పెన్షన్లు ఇస్తారు.

ఒకవేళ తమ దగ్గర డేటా లేదనీ, ఒక పెన్షనే ఇస్తామని సచివాలయ ఉద్యోగులు చెబితే.. అప్పుడు ఆ పెన్షన్ తీసుకోవాలి. అది డిసెంబర్ నెల పెన్షన్ మాత్రమే అవుతుంది. ఆ లెక్కన మిస్సయిన నవంబర్ నెల పెన్షన్‌ను జనవరిలో పొందేలా ప్లాన్ చేసుకోవాలి. ఇందుకోసం.. గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి. తమకు నవంబర్ నెల న్షన్ ఎగ్గొట్టారని చెప్పాలి. దాంతో సచివాలయ ఉద్యోగులు ఆ విషయాన్ని రాసుకుంటారు. జనవరిలో 2 పెన్షన్లు వచ్చేలా చేస్తారు.

సీఎం చంద్రబాబు ఆ మధ్య 3 నెలల పెన్షన్ ఒకేసారి ఇవ్వొచ్చని అన్నారు. అంటే.. ఎవరైనా 2 నెలల పెన్షన్ తీసుకోకపోతే, 3వ నెలలో.. మొత్తం 3 నెలల పెన్షన్ పొందవచ్చు. ఇలా.. నవంబర్ నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. అందువల్ల నవంబర్, డిసెంబర్‌లో కూడా ఎవరైనా పెన్షన్ మిస్సయితే.. వారు జనవరిలో 3 నెలల పెన్షన్ పొందవచ్చు. అలా తమకు పింఛను రాలేదనే విషయాన్ని సచివాలయ ఉద్యోగులకు తెలిసేలా చెయ్యాలి. ఉద్యోగులు పెన్షన్ ఇవ్వకపోతే, కలెక్టర్ ఆఫీసుకి వెళ్లి కంప్లైంట్ ఇవ్వొచ్చు. సాధారణంగా అలా జరిగే అవకాశాలు ఉండవు. ఉద్యోగులు కచ్చితంగా పెన్షన్ ఇస్తారు. ఇలా లబ్దిదారులు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్ మిస్సవకుండా పొందేలా ప్లాన్ చేసుకోవాలి.