పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అన్నడంతే..ట్రాఫిక్ పోలీస్ ఏం చేశాడంటే..?
అభిమానం వెర్రి వేషాలు అన్నట్టుగా మారిపోయింది జనసేన అభిమానుల తీరు. తాజాగా పవన్ అభిమానులు చేసిన చర్య ఆయనకు చెడ్డ పేరు తీసుకువచ్చేలా చేసింది. జనసేన స్థాపించిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు పవన్ కల్యాణ్.
2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పొటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. భీమవరం, గాజువాక స్థానాల నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్‌కు ఒక్క చోట కూడా విజయం దక్కని పరిస్థితి.
ఒంటరిగా వెళ్తే జగన్‌ను ఎదుర్కొవడం కష్టమని భావించిన పవన్,టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లారు. పోటీ చేసింది 21 స్థానాల్లో అయినప్పటికి అన్ని స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
అయితే పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి ఆయన అభిమానులు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బైక్స్ మీద రాసుకుంటున్నారు. ఇది పవన్ దృష్టికి వెళ్లడంతో అభిమానులను అలా చేయవద్దని వారించారు. ఇలా చేయడం వల్ల తనకు చెడ్డపేరు వస్తోందని, ఆర్టీఓ అధికారులకు చాలా ఇబ్బంది అని.. ఇలాంటి పనులు చేయవద్దని అభిమానులను పవన్ వారించారు. అయినప్పటికి అభిమానుల తీరులో ఎటువంటి మార్పు కనిపించడం లేదు.
తాజాగా ఓ అభిమాని తన బైక్‌పై పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని నెంబర్ ప్లేట్ మీద రాసుకున్నాడు. దీన్ని గమనించిన ట్రాఫిక్ అధికారి ఆ బైక్‌ను అపి మరి వారిని ప్రశ్నించాడు. మీలో ఎవరు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ప్రశ్నించడం జరిగింది. వెంటనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని ఉన్న నెంబర్ ప్లేటును తొలగించిన దాని స్థానంలో ఆ బండి నెంబర్‌ను వారితోనే పెట్టించడం జరిగింది. ఇలాంటివి చేయవద్దని వారిని ఆ ట్రాఫిక్ అధికారి హెచ్చరించడం జరిగింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
పిఠాపురం MLA తాలూకా… అని ఆ ఒక్క చోట కాకుండా ఎక్కడైనా వేయించుకొండి..👇#TDP #YSRCP #BJP #Janasena pic.twitter.com/n01aMet5SX
— sivazee (@sivazeestudio) July 6, 2024