నేటి జాబ్ మార్కెట్‌లో కొలువు దక్కించుకోవాలంటే ఎన్నో నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా పరిశ్రమలకు అవసరమైన స్కిల్స్ ఏంటో విద్యార్థి దశలోనే తెలుసుకోవాలి. వాటిని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ అమూల్య అవకాశాన్ని దేశ యువతకు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం.. ప్రధాని మంత్రి ఇంటర్నెన్ షిప్ పథకాన్ని ప్రారంభించింది. దేశంలోని 500 పైచిలుకు కంపెనీల్లో ఇంటర్న్‌లుగా చేరి అమూల్యమైన పని అనుభవాన్ని గడించే అవకాశం ఈ పథకం ద్వారా యువతకు లభిస్తుంది. అయితే, ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ ఇప్పటికే ముగిసినా కేంద్రం యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని డెడ్‌లైన్ మరికొన్ని రోజుల పాటు పొడిగించింది. ఈ నెల 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. కెరీర్‌లో దూసుకుపోవాలనుకునే యువత ఈ ఛాన్స్‌ను అస్సలు మిస్సవ్వొ్ద్దని నిపుణులు చెబుతున్నారు (PM Internship Scheme Deadline Extended ).
గతేడాది బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే అభ్యర్థులు https://pminternship.mca.gov.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇంటర్న్‌షిప్ పొందిన వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం స్టూఫెండ్ కూడా ప్రకటించింది.
ఇంటర్నెట్ షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న వారు మాత్రమే అర్హులు. 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా చేసిన వారు ఇంటర్న్‌షిప్‌కు అర్హులు.
దరఖాస్తు ఇలా..
ముందుగా పీఎమ్ ఇంటర్న్‌షిప్ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అభ్యర్థులు తమ ప్రాథమిక వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఆ తరువాత తమకు వచ్చిన లాగిన్ ఐడీతో మరోసారి లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫార్మ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
కోటి మంది యువతకు రాబోయే అయిదేళ్లల్లో ఇండస్ట్రీకి అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇంటర్న్‌షిప్‌లో చేరాక అభ్యర్థికి నెలకు రూ. వేల చొప్పున ఏడాది పాటు ఆర్థిక సాయం అందిస్తారు. ఇక కంపెనీలో చేరే ముందు వన్ టైం గ్రాంట్ కింద మరో రూ.6 వేలు ఇస్తారు. ఇంటర్వ్యూలో చేరిన వారికి బీమా సౌకర్యం కూడా ఉంటుంది.