రైతుల కోసం మోదీ సర్కార్ నూతన సంవత్సర కానుక రెడీ.. త్వరలోనే ఖాతాల్లో జమ

www.mannamweb.com


ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులు 19వ విడత సహాయం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. పంట పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ పథకం ద్వారా ఏటా మూడు విడతల్లో రైతులకు 6వేలను రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఆధార్-లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేయబడుతుంది.

అయితే నకిలీ ఖాతాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేసిన రైతులకు మాత్రమే 19వ విడత సాయం అందుతుంది. OTP-ఆధారిత e-KYCని పూర్తి చేయడానికి, రైతులు తప్పనిసరిగా వారి బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన యాక్టివ్ లో ఉన్న మొబైల్ నంబర్‌ను కలిగి ఉండాలి.

రైతు సంక్షేమంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఎన్నో పథకాలు అమలు చేస్తూ అన్నదాతను ఆదుకుంటున్న ప్రభుత్వం 2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి కేంద్రం రైతులకు పంటసాయం అందిస్తోంది. పీఎం కిసాన్ యోజన పథకంలో భాగంగా ఏటా రూ.6,000 ఉచిత పంట సాయం అందజేస్తున్నారు. ప్రస్తుతం, దేశంలోని అర్హులైన రైతులందరూ ఈ పథకం ప్రయోజనాలను పొందుతున్నారు. ఏప్రిల్‌-జూలై, ఆగస్టు-నవంబర్‌, డిసెంబర్‌-మార్చిలో ఒక్కో విడతలో ఎకరాకు రూ.2000 చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల 18వ విడత పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేశారు. ఈ డబ్బు రైతుల ఖాతాల్లో 05 అక్టోబర్ 2024న జమ చేయబడింది. రూ. 2వేలు పంట సాయంగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం పీఎం కిసాన్ 19వ విడతపై కీలక కసరత్తులు జరుగుతున్నాయి. 19వ విడత పీఎం కిసాన్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ డబ్బును ఫిబ్రవరిలో విడుదల చేయాలని తొలుత భావించిన మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

కొత్త సంవత్సరం ప్రారంభంలో రైతులు సంబరాలు చేసుకునేందుకు గాను 19వ విడత పీఎం కిసాన్ నిధులను జనవరి మొదటి లేదా రెండో వారంలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అంతేకాదు పీఎం కిసాన్ 18వ విడత అందని రైతులకు 19వ విడతతో పాటు ఆ సొమ్మును జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.