దళిత ఎంపీడీవోపై వైసీపీ మాజీ ఎంపీపీ దాడి
అన్నమయ్య జిల్లా గాలివీడులో దౌర్జన్యకాండ
ఎంపీపీ గది తాళాలు ఇవ్వనందుకు దాడి
హత్యకు యత్నించారని జవహర్‌బాబు ఫిర్యాదు
నిందితుడు సుదర్శన్‌రెడ్డి, అనుచరులపై కేసు నమోదు
రాయచోటి
రాష్ట్రంలో దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఆగడం లేదు. తాజాగా.. మండల పరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) కార్యాలయంలోకి ప్రవేశించి, విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డా రు. గొంతు మీద కాలేసి తొక్కి, పిడిగుద్దులు కు రిపించారు. నానా దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గాలివీడు మండంలో శుక్రవారం చోటుచేసుకుంది. వైసీపీ నేతలు బరితెగించడానికి కారణం ఏంటంటే.. ఎంపీపీ చాంబర్ తాళాలు అడిగితే.. వైసీపీ నాయకులకు తాళాలు ఇవ్వలేవని, ఎంపీపీ వస్తే ఇస్తానని చెప్పడమే!!
నాకే తాళాలు ఇవ్వవా..?
గాలివీడు ఎంపీడీవోగా దళితుడైన జవహర్‌బాబు పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎంపీపీ, ప్రస్తుత ఎంపీపీ కొడుకు జల్లా సుదర్శన్‌రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. ఆఫీస్ తాళాలు కావాలని తన అనుచరులతో ఎంపీడీవోను అడిగించారు. తాళాలు ప్రస్తుతం తన వద్ద లేవని, అటెండర్ వద్ద ఉన్నాయని, 15 నిమిషాలు ఆగమని జవహర్‌బాబు బదులిచ్చా రు. తర్వాత మళ్లీ సుదర్శన్‌రెడ్డి అనుచరులు వచ్చి తాళాలు అడగ్గా.. వైసీపీ నేతలకు తాళాలు ఇవ్వలేమని, ఎంపీపీ వస్తే ఇస్తానని తెలిపారు. దీంతో ఆగ్రహించిన సుదర్శన్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఎంపీడీవో చాంబర్‌లోకి వచ్చి, గది తలుపులు మూసి జవహర్‌బాబుపై దాడికి పాల్పడ్డారు. అక్కడున్న సిబ్బంది తలుపులు బద్ద లు కొట్టి ఎంపీడీవోను రక్షించారు. దాడి ఘటనపై ఎంపీడీవో మాట్లాడుతూ తనను సుదర్శన్‌రెడ్డి కుర్చీలో నుంచి కిందకు పడేసి.. గొంతు మీద కాలేసి తొక్కాడని, కర్రలు, కుర్చీలతో కొట్టారని విలపిస్తూ పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఎంపీడీవోను పరీక్షిం చి ఆరోగ్యం నిలకడగా లేదని, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి.. అక్కడి నుంచి కడపరిమ్స్‌కు తీసుకెళ్లారు.
నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అనుచరుడు
విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఎంపీడీవోకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఎంపీడీవో ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, విధులకు ఆటంకం కలిగించడం, కులం పేరుతో దూ షించడం, అక్రమంగా చాంబర్‌లోకి ప్రవేశించి దాడి చేయడం వంటి ఆరోపణలపై గాలివీడు పోలీసులు సుదర్శన్‌రెడ్డితో పాటు మరో 13 మం ది, మరికొందరిపై కేసు నమోదు చేశారు. రాయచోటి డీఎస్పీ క్రిష్ణమోహన్ పర్యవేక్షణలో విచార ణ జరుగుతోంది. గాలివీడులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఎంపీడీవోపై దాడికి పాల్పడిన సుదర్శన్‌రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ముఖ్య అనుచరుడు. ప్రస్తుతం ఇతను పోలీసుల అదుపులో ఉన్నాడని సమాచారం. కాగా, ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడిని ఏపీ పీఆర్ గెజిటెడ్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పంచాయతీరాజ్ అధికారులకు తగిన భద్రత కల్పించాలని సంఘం నేతలు కేఎస్ వరప్రసాద్, వెంకట్రావు కోరారు.
దాడిపై పవన్ ఆగ్రహం
నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబుపై దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాలివీడు ఘటనపై ఆయన శుక్రవారం అధికారులతో చర్చించారు. ఎంపీడీవోపై వైసీపీ నేత సుదర్శన్‌రెడ్డి, అతని అనుచరులు దాడిచేయడాన్ని ఖండించారు. దాడికి గురైన ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జవహర్‌బాబును పరామర్శించి, ధైర్యం చెప్పాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు డిప్యూటీ సీఎం సూచించారు.
నేడు కడపకు పవన్
కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును పరామర్శించేందుకు పవన్ కల్యాణ్ శనివారం కడప వెళ్లనున్నారు. ఎంపీడీవోను పరామర్శించి పంచాయతీరాజ్ శాఖ అధికారులు, ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం పెంచేందుకు ఆయన ఈ పర్యటనకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఒక మండల స్థాయి అధికారి కోసం సాక్ష్యాత్తూ ఉప ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పరామర్శించాలని నిర్ణయం తీసుకోవడంపై పంచాయతీరాజ్ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది.