పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు

సినీ నటుడు,నిర్మాత పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పల్నాడు జిల్లా టిడిపి నేత కొట్టా కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసరావుపేట 2వ పట్టణ పొలీసులు కేసు నమోదుచేసి కోర్టు కు హాజరు పరచిన విషయం అందరికీ తెలిసిందే.వైసీపీ లీగల్ టీమ్ న్యాయవాది రాప్రోలు శ్రీనివాసరావు పోసాని తరఫున వాదనలు వినిపించగా ఈ రోజు నరసరావుపేట కోర్టు మేజిస్ట్రేట్ వారు బెయిల్ మంజూరు చేశారు.


పవన్‌ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 3 నెలల క్రితం జనసేన నేత ఫిర్యాదుతో విజయవాడ భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో పీటీ వారెంట్‌పై పోసాని కృష్ణమురళిని విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. మరోవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు పోసాని. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరారు. ఇప్పటి వరకు పోసానిపై మొత్తం 16 కేసులు నమోదవ్వగా.. ఐదు కేసుల్లో రిలీఫ్‌ లభించింది. పాలకొండ, భవానీపురం, పాడేరు, విశాఖ, పట్టాభిపురంలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోసాని.