ఇది కదా గుడ్ న్యూస్ అంటే.. ఆ వ్యాధిగ్రస్తులకు రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే..

మధుమేహ వ్యాధిగ్రస్తులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇకపై రైళ్లలో ప్రయాణించే డయాబెటిక్ రోగులకు తక్కువ ధరకే ప్రత్యేక ఆహారాన్ని అందించనుంది. సాధారణ ప్రయాణికులకు అందించే భోజనం కాకుండా డయాబెటీస్ రోగులకు.. అనుకూమైన ప్రత్యేక ఆహారాన్ని రైల్వేశాఖ అందించనుంది. మరో విషయం ఏంటంటే ఇందుకు అదనపు చార్జీలు కూడా వసూలు చేయట్లేదు.

రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణీకుల కోసం భారతీయ రైల్వే సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్షంతో ఇటీవల, IRCTC డయాబెటిక్ రోగుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణంలో వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించడానికి నిర్ణయించుకుంది.


ఇక నుంచి రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి అన్ని ప్రీమియం ట్రైన్‌లో ఈ ప్రత్యేక ఆహారాన్ని అందించనుంది రైల్వేశాఖ. ఈ ప్రత్యేక భోజనానికి ప్రయాణికుల నుంచి అధికారులు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు. ప్రయాణికులు టికెట్‌ బుక్‌ చేసుకునేప్పుడు తమకు కావాల్సిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు.

ప్రపంచంలో ఎక్కవ శాతం మధుమేహ వ్యాధిగ్రస్తులు మన దేశంలోనే ఉన్నారని కొన్ని నివేదికలు చెబుతున్నారు. మన దేశంలో దాదాపు 22 కోట్ల మంది టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. యువతలో కూడా ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే రైల్వేలు ఈ కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి.

రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం.. ప్రస్తుతం ఈ సౌకర్యం కొన్ని రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్‌తో సహా అన్ని ప్రీపెయిడ్ రైళ్లలో ఐదు రకాల ఆహారాలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి శాఖాహారం, మాంసాహారం, జైన్ ఆహారం, డయాబెటిక్ శాఖాహారం, డయాబెటిక్ మాంసాహారం. మీకు నచ్చినదాన్ని మీరు ఎంచుకోవచ్చు.

ప్రయాణికులు ట్రైన్ ఎక్కే ముందే వారు తమ ఆహారాన్ని ఎంచుకోవచ్చు. లేదంటే టికెట్ బుక్ చేసుకున్న తర్వాత కూడా వారు తమ ఆహార ఎంపికను మార్చుకోవచ్చు. ఈ పథకం తక్షణమే అమల్లోకి వచ్చినట్టు రైల్వేశాఖ పేర్కొంది. దీని గురించి మరింత సమాచారం కోసం మీరు రైల్వేశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.