కోపం ఎక్కువ రావడానికి కారణాలివే.. ఒత్తిడి-ఆందోళన వల్ల వస్తే ఇలా తగ్గించుకోండి

మీకు కోపం ఎక్కువగా వస్తోందా? అయితే మీరు ఒత్తిడి, ఆందోళనతో ఇబ్బంది పడుతున్నట్లు అర్థమని చెప్తున్నారు డాక్టర్ అర్చికా.


డిడి ధ్యానంలో పీహెచ్డీ చేసిన ఆమె.. కోపం అనేది ఆందోళనకు మరొక రూపమని.. ఒత్తిడి వల్ల పెరిగే ఈ ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి ధ్యానం చేయాలని చెప్తున్నారు. మనసులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా, ఫ్యామిలీ పరంగా నెరవేరని అంశాలు ఎన్నో ఉంటాయి. ఆ సమయంలో “ఏం చేయాలి, ఏమి చేయలేకపోతున్నామనే” నిరుత్సాహంలో ఒత్తిడి పెరిగి.. అది కోపంగా బయటకు వస్తుందని తెలిపారు. అందుకే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఇరిటేట్ అవుతూ ఉంటారని తెలిపారు.

ఈ తరహా ఎమోషన్స్​ని కంట్రోల్ చేసుకోవడానికి.. ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవడానికి ధ్యానం చేయాలని చెప్తున్నారు. కోపాన్ని అణిచివేయనవసరం లేనప్పుడు దానిని మళ్లించడానికి, ఇతరులపై దానిని చూపించకుండా ఉండేందుకు సరైన మార్గాన్ని అవలంభించాలని అర్చికా చెప్తున్నారు. కోపాన్ని, ఒత్తిడిని తగ్గించేందుకు శాస్త్రీయంగా హెల్ప్ చేసే పద్ధతులను ఆమె వివరించారు. అవి ఏంటో.. వాటిని ఎలా చేయాలో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

బ్రీతింగ్ టెక్నిక్..

కోపం వచ్చినప్పుడు శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి, నాడీ వ్యవస్థను రిలాక్స్ చేయడానికి అత్యంత సింపుల్ మార్గం శ్వాస. యోగ తత్వశాస్త్రంలో.. ఈ అభ్యాసం కోపాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి మనసును రిలాక్స్ చేస్తుంది. దీనిని ఎలా చేయాలంటే.. కోపం వస్తున్నప్పుడు మీ గుండెపై ఒక చేతిని పెట్టుకోవాలి. నాలుగు సెకన్లు గాలి పీల్చుకోవాలి. ఆరు సెకన్లు బయటకు వదలాలి. ఇది యాక్షన్, రియాక్షన్ మధ్య వంతెనగా చేస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది.

థాట్ లెడ్జర్

కోపంగా ఉన్నప్పుడు.. మనసు ఓ స్టోరిని అల్లుతుంది. అయితే మీరు దానికి వ్యతిరేక దిశలో ఆలోచిస్తున్నామని మనసుకు చెప్పాల్సి ఉంటుంది. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. అందుకే కోపం వస్తుంది అనుకుంటూ చెప్పుకోవాలి. లేదా మీరు ఆలోచనను డైవర్ట్ చేసే వాటిపైకి తీసుకెళ్లాలి. కోపం వ్యక్తం చేయడానికి బదులుగా.. మీ మైండ్​లో దానికి సంబంధించిన గుడ్, బ్యాడ్ నోట్స్ రాసుకోండి. ఇది కోపాన్ని తగ్గించడానికి, అలాగే ఇతరులపై దానిని వ్యక్తం చేయడానికి గ్యాప్ ఇస్తుంది. ఆ సమయంలో మీ కోపం కచ్చితంగా తగ్గుతుందని శాస్త్రం చెప్తుంది.

కోపంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఆ టాపిక్ మీద నుంచి డైవర్ట్ చేసుకోగలిగితే కచ్చితంగా మార్పులు చూడవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైనా కోపం తెప్పించే విషయం గురించి రియాక్ట్ అవుతున్నారా? రెస్పాండ్ అవుతున్నారో చెక్ చేసుకుంటూ ఉండాలి. కోపాన్ని ట్రిగర్ చేసే అంశాలు తెలుసుకోండి. ఇవన్నీ మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయని చెప్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.