America: ఉన్నత చదవుల కోసం అమెరికాలో భారతీయ విద్యార్థు విషాదాంతాలు ఆగడం లేదు. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు దుర్మరణం చెందారు. పది రోజులు తిరగకుండానే తాజాగా మరో తెలుగు విద్యార్థిని అక్కడి రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. న్యూయార్క్ నగరంలో ఈ ఘటన జరిగింది. ఈమేరకు భారత రాయబార కార్యాలయం ధ్రువీకరించింది. విద్యార్థి న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నట్లు పేర్కొంది. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. అతడి అకాల మరణం గురించి తెలిసి బాధపడ్డాం. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు ఆ కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం’ అని కాన్సులేట్ జనరల్ ఎక్స్‌లో పేర్కొన్నారు. అచ్యుత్‌ది ఏ ఊరు, తల్లిదండ్రుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఆగని యాక్సిడెంట్ మరణాలు..
అమెరికాలో పలువురు భారతీయ యువతీ యువకులు వివిధ ప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. మే 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీయ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీశర్మ దుర్మరణం చెందారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో కారు ప్రనమాదం ఈ ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. మృతులు ముగ్గురు 18 ఏళ్లలోపు వారే. ఇక ఏప్రిల్‌లో జరిగిన కారు ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కల్పోయారు. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ మృమాదంలో మృతిచెందారు.