Rosemary దీంతో నిజంగానే బట్టతలపై జుట్టు వస్తుందా?

జుట్టు ఒత్తుగా పెరగాలన్నా, నల్లగా నిగనిగలాడుతూ ఉండాలన్నా, దానికి బాహ్య సంరక్షణతో పాటు లోపలి పోషకాలు కీలకం. Rosemary Water మరియు Rosemary Oil ని జుట్టు కోసం చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఇది ట్రెండ్ అయింది. సోషల్ మీడియా సెలబ్రిటీలు దీన్ని ప్రమోట్ చేయడంతో ఇంకా ప్రాచుర్యం పొందింది.


ఇప్పుడు ఎక్కడ చూసినా Rosemary Water గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు ఇది ఎలా ఉపయోగపడుతుందో సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు, పోస్ట్లు కనిపిస్తున్నాయి. రోజ్ మేరీ ఆకులను ఎప్పటి నుంచో నూనెలు, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు.

కానీ ఇప్పుడు దీని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అనేక కంపెనీలు Rosemary తో హెయిర్ సీరమ్స్, ఆయిల్స్ తయారు చేసి మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి. కానీ ఇది నిజంగా రాలిపోయిన జుట్టును తిరిగి పెంచగలదా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

Rosemary Water ని జుట్టుకు ఉపయోగిస్తే, వెంట్రుకల రోమకూపాలు బలపడతాయి, కొత్త జుట్టు పెరుగుదలకు దోహదపడతాయని చెప్పబడుతోంది. ఇది ఎలా తయారు చేస్తారు మరియు ఎలా ఉపయోగించాలి? Rosemary Water తాజా రోజ్ మేరీ ఆకులను వేడి నీటిలో నానబెట్టడం ద్వారా తయారు చేస్తారు. ఈ మూలికకు ఔషధ గుణాలు ఉన్నాయి.

ఇది యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నీటిని జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేస్తే, జుట్టు బలంగా పెరుగుతుంది. Rosemary Oil కూడా జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

మార్కెట్ లో Rosemary Oil, Serum, Water వంటి వివిధ హెయిర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదలకు కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ కొందరు దీని ద్వారా బట్టతల మీద కూడా జుట్టు వస్తుందని భావిస్తున్నారు. ఇది పూర్తిగా నిజం కాదు.

ఆండ్రోజెనిక్ అలోపేసియా వంటి సమస్యలకు ఇది పరిష్కారం కాదు. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం, ఇన్ఫ్లమేషన్ తగ్గించడం మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ బట్టతలపై జుట్టు పెరగడానికి ఇది పరిష్కారం కాదు.

(NOTE: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏవైనా ఆరోగ్య సమస్యలకు నిపుణులను సంప్రదించండి.)