లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతుబంధు సాయంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..
ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో వారందరికీ ‘రైతు బంధు’ సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు. అసెంబ్లీలో ఈ విషయంపై విపులంగా చర్చించి తుది నిర్ణయం కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకాల్లో ఆదాయం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా జీఎస్టీ ఆదాయం కూడా రూ.500 కోట్లు పెరిగిందని తెలిపారు.