SBI బంపరాఫర్.. 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు

www.mannamweb.com


ప్రస్తుతం దాదాపు అన్ని బ్యాంకులు ఎంఎస్ఎంఈల రుణ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం SBI..”SME డిజిటల్ బిజినెస్ లోన్స్(SME Digital Business Loans)”​ ప్రారంభించింది.

దీని ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME)కు కేవలం 45 నిమిషాల్లోనే లోన్ మంజూరు చేస్తామని ప్రకటించింది. రాబోయే ఐదేళ్లు బ్యాంకు రుణాల వృద్ధి, లాభాలకు ఈ సంస్థలే కీలకమని భావిస్తున్నట్లు ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా తెలిపారు. ఈ సంస్థల రుణ అవసరాలను వేగంగా మదింపు చేసి, రుణాలు మంజూరు చేసేందుకే ‘ఎస్‌ఎంఈ డిజిటల్‌ బిజినెస్‌ లోన్స్‌’ పేరుతో ప్రత్యేక పథకం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా 10 సెకన్లలో MSMEల రుణ అర్హతను మదింపు చేసి, 45 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.

కొత్తగా ప్రారంభించిన ఈ విధానం సంప్రదాయంగా ఉన్న క్రెడిట్ అండర్ రైటింగ్, సుదీర్ఘ పరిశీలనల వంటి వాటిని తొలగిస్తుందని, చిన్న పరిశ్రమలకు లోన్ జారీ సరళంగా ఉండటం సహా వేగం పెరుగుతుందని తెలిపారు.

డేటా ఆధారిత లోన్ మంజూరు టెక్నాలజీని అభివృద్ధి చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. ఐటీఆర్, జీఎస్‌టీ రిటర్న్స్, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు మొదలైనవాటితో పాటు అవసరమైన వివరాలను సమర్పిస్తే కేవలం 10 సెకన్లలోపే లోన్ మంజూరు చేయాలా, వద్దా అనేది సిస్టమ్ నిర్ణయిస్తుంది. ఈ విధంగా వేగంగా లోన్ మంజూరు చేయడానికి వీలవుతుంది. దీంతో ఎంఎస్ఎంఈల లోన్ మార్కెట్ లో తమ స్థానం మరింత పటిష్టమవుతుందని ఎస్బీఐ భావిస్తోంది.

ఇక,గత ఆర్థిక సంవత్సరం ఎస్బీఐ ఎంఎస్ఎంఈ సంస్థలకు రూ.4.33 లక్షల లక్షల కోట్ల రుణాలు ఇవ్వగా.. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 20 శాతం ఎక్కువ.