SBI Mutual Fund: రూ.25 వేల పెట్టుబడితో రూ.9.58 లక్షల రాబడి.. రిస్క్‌ అస్సలు ఉండదు..

www.mannamweb.com


భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బీఐ) మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ స్కీమ్ ను అమలు చేస్తుంది. దీనిలో రూ. 25 వేలు పెట్టుబడి పెడితే నిర్ణీత కాల వ్యవధి తర్వాత రూ. 9.58 లక్షలు పొందుతారు. అంటే పెట్టుబడిదారుడికి దాదాపు 40 రెట్ల వరకు రిటర్న్‌ వస్తాయి. ఎస్ బీఐ అమలు చేస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కు ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంది.
జీవితంలో ప్రతి ఒక్కరికీ పొదుపు చాలా అవసరం. మనకు వచ్చే ఆదాయం నుంచి ఖర్చులు పోను కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి. ఈ అలవాటు మిమ్మల్ని అనేక ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. క్రమశిక్షణ కలిగిన జీవితం అందిస్తుంది. నేడు మనకు అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర అనేక రకాలుగా పొదుపును పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. వీటిని నుంచి వచ్చే రాబడి కూడా మారుతూ ఉంటుంది. మన పెట్టుబడికి అధిక రాబడి రావడమే ముఖ్య లక్ష్యం. కాబట్టి ఆలోచించి పెట్టుబడులు పెట్టాలి. కొన్ని పెట్టుబడులకు రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. దానికి మీద వచ్చే ఆదాయం కూాడా తక్కువగా లభిస్తుంది. మరికొన్నింటికి రిస్క్ అధికమైనా రాబడి చాలా బాగుంటుది.

ఎస్ బీఐ స్కీమ్..
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్ బీఐ) మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ స్కీమ్ ను అమలు చేస్తుంది. దీనిలో రూ. 25 వేలు పెట్టుబడి పెడితే నిర్ణీత కాల వ్యవధి తర్వాత రూ. 9.58 లక్షలు పొందుతారు. అంటే పెట్టుబడిదారుడికి దాదాపు 40 రెట్ల వరకు రిటర్న్‌ వస్తాయి. ఎస్ బీఐ అమలు చేస్తున్న ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కు ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంది.

ప్రయోజనాలు ఇవే..
మాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ పథకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రెండు వేర్వేరు పద్ధతులలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ ఐపీ) చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్ రాబడి విషయానికి వస్తే గత సంవత్సరంలో 35.4 శాతం, గత రెండేళ్లలో 21.71 శాతం రాబడిని ఇచ్చింది. గడచిన ఐదేళ్లలో దాదాపు 21.44 శాతం రాబడిని పెట్టుబడి దారులకు అందజేసింది. ఆ లెక్కల ప్రకారం.. ప్రతి సంవత్సరం సగటు రాబడి 20 శాతం కంటే ఎక్కువగానే ఉంది. ఈ ఫండ్ లో ఇప్పటి వరకూ రూ.12,555 కోట్ల పెట్టుబడిని ప్రజలు పెట్టారు.
20 శాతం వార్షిక రాబడి..
స్టేట్ బ్యాంకు అమలు చేస్తున్న ఈ స్కీమ్ లో ఎంత రాబడి వస్తుందో తెలుసుకుందాం. ఈ పథకంలో ఒకేసారి రూ.25 వేలు ఇన్వెస్ట్ చేయాలి. దాని ద్వారా మీకు స్థిరంగా 20 శాతం వార్షిక రాబడిని అందుతుంది. మీరు మీ పెట్టుబడిని 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తే, మెచ్యూరిటీ విలువ రూ. 9.58 లక్షలు అవుతుంది. ఈ ఫండ్ అప్పుడప్పుడూ రాబడులు ఇచ్చేది కాదు, ప్రారంభించినప్పటి నుంచీ కూడా సగటు వార్షిక రాబడి 20 శాతంగా ఉంటుంది.