AP Rains: విద్యార్థులకు అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు
AP Rains:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం కారణంగా ఏపీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు జిల్లాల్లో నదులు పొంగిపొర్లుతుడటం..భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరింది.
ఈ క్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు కలెక్టర్ మహేశ్ కుమార్. గోదావరి నది ఉద్ధృతి దృష్ట్యా సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మరో జిల్లా అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ జిల్లాలో రెండురోజులపాటు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సోమవారం పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాడేరు డివిజన్ లో మాత్రం సోమవారం నుంచి విద్యాసంస్థలు కొనసాగుతాయి. భారీ వర్షాలు కొనసాగుతున్నట్లు మరికొన్ని జిల్లాలో కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించే ఛాన్స్ ఉంది.