Success Story: స్కూల్ టీచర్ నుంచి రూ.300 కోట్ల కంపెనీకి అధిపతి.. ఎంతోమందికి ఈమె ఆదర్శం

www.mannamweb.com


సాధారణంగా ఒక మంచి పుస్తకాన్ని చదివితే మనకు గుర్తుంటుందో లేదో తెలియదు. కానీ, కొంతమంది విజయగాథలు వింటే.. అది మెదడులో చెరగకుండా ముద్ర వేసుకుపోతుంది. అంతేకాకుండా.. వారి సక్సెస్‌ అనేది పది మందికి ఆదర్శంగా నిలిస్తుంది. ఇక లైఫ్‌ లో దేనిని సాధించాలేం, ఇది అసాధ్యాం అనుకున్న వారు సైతం.. వారి మీద వారికి నమ్మకం కలిగి దేనినైనా సాధించగలం అనేలా చేస్తుంది. అందుకే దేనినైనా మార్పు, సాధించాలనే పట్టుదల ఉంటే.. అది ఒక మనిషి విజయగాథ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. అయితే, అలాంటి గొప్ప సక్సెస్‌ అందుకున్న వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఓ అమ్మాదయి కూడా ఒకరు. ఆమె పేరు ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా. కేవలం స్కూల్‌ టీచర్‌ గా మొదలుపెట్టిన ఆమె ప్రయాణం నేడు రూ.300 కోట్ల కంపెనీకి అధిపతిగా ఎదిగారు. మరి, ఆమె విజయాగాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా.. ఈమె భారతీయ ఎంటర్‌ప్రైనర్ గా సింగపూర్‌లో ప్రీస్కూల్ నిర్వహిస్తున్నారు. కాగా, ప్రేరణ ఒకప్పుడు స్కూల్ టీచర్‌గానే పని చేశారు. ఈ క్రమంలోనే ఎంతోమంది చిన్నారులకు పాఠాలు బోధించారు.అయితే స్కూల్ టీచర్‌గా ఉన్న క్రమంలోనే.. సింగపూర్‌లో లిటిల్ పాడింగ్టన్ అనే ప్రీస్కూల్ నెలకొల్పారు. ఆ తర్వాత.. ఆమె ‘క్రియేటివ్ గెలిలియో’ పేరుతో ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రారంభించారు. కాగా, ఈ స్టార్టప్ అనేది ప్రధానంగా 3-10 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు విద్యాభ్యాసంపై దృష్టిసారించింది. ఇక ఈ క్రియోటివ్ గెలిలియో ద్వారా.. పిల్లలకు పుస్తకాలకు మించిన కార్యకలాపాలు, అనుభవాలు నేర్చుకునే అవకాశం లభించింది.

అయితే ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా తన గ్రాడ్యుయేషన్ ను న్యూయార్క్ యూనివర్సిటీలో పూర్తి చేశారు. కాగా, అక్కడ ఆమె కంపెనీ రెండు యాప్స్ లాంచ్ చేసింది. అవే టూండమీ, లిటిల్ సింఘం. ఈ రెండు యాప్స్‌కి విశేషమైన స్పందన లభించింది. అలా ఒక్కొక్కటి 1 కోటికిపైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. ముఖ్యంగా..భారత ప్లే స్టోర్ లోని 20 టాప్ ఎడ్యుకేషన్ యాప్స్‌ను దాటుకుని ఈ కిండ్స్ లర్నింగ్ యాప్స్ ముందుకెళ్లడం విశేషం. అయితే ప్రేరణ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఈ యాప్స్ ద్వారా చిన్నారులకు తగిన అభ్యాస ప్రయాణం, వీడియో కథనాలు, గేమిఫికేషన్ అందిస్తున్నాయి. కానీ, ఓ స్కూల్‌ టీచర్‌ గా పిల్లలకు పాఠలు బోధించిన ప్రేరణ.. ఎడ్యుకేషన్ స్టార్టర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టేందుకు ఎలాంటి బిజినెస్ ఎడ్యుకేషన్ కోర్సులు చేయలేదు.

కాకపోతే, ఇలాంటి బిజినెస్‌ రంగంలో అడుగుపెట్టేందుకు చాలామంది స్టార్టప్ ఫౌండర్లు ఐఐటీ, ఐఐఎం లేదా ఇతర బిజినెస్ స్కూల్స్ లో శిక్షణ తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ ప్రేరణ ఎలాంటి అనుభవం లేకుండానే ఎడ్యుటెక్ స్టార్టప్ వ్యాపారంలో దూసుకెళ్తున్నారు. ఇకపోతే ప్రేరణ కంపెనీ గతేడాది రూ.60 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా స్టార్టప్ విలువ 40 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు రూ.330 కోట్లుగా ఉంటుందని అంచనా.