టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది అన్ని నిత్యావసర వస్తువులు కల్తీ అయిపోతున్నాయి. అయితే కొందరు టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే.. మరికొందరు మాత్రం చెడుకు వాడుతున్నారు. ముఖ్యంగా పలు రసాయనాలు వాడుతూ వ్యాపారస్తులు సొమ్ము చేసుకుంటున్నారు. కూరగాయలు, పండ్లు, పూలు కొనుగోలు దారులకు అట్రాక్టింగ్‌గా కనిపించడానికి పలు రకాల రంగులు వాడుతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసి ఉంటాం.
అయితే ఇప్పుడు మహిళలు జడలో పెట్టుకునే మల్లెపువ్వుల కోసం కూడా రసాయనాలు వాడుతూ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎండాకాలంలో మల్లె పువ్వులు విరివిగా అందుబాటులో ఉంటాయి. దీంతో మహిళలు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా.. ఏదైనా ఫంక్షన్స్‌కు కొనుగోలు చేసి మరీ జడలో పెట్టుకుంటుంటారు. అయితే మల్లెపువ్వులను ‘కాపర్ సల్ఫేట్’ లో ముంచి తీస్తున్న వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంది. వైరల్ అవుతున్న వీడియోలో.. మల్లె పువ్వులు దండలు పట్టుకుని కొందరు వాటిని కాపర్ సల్ఫేట్ కలిపిన నీటిలో ముంచి ఆ పువ్వులను మరో ట్రేలో వేస్తున్నారు.
అయితే ఇలా చేయడం వల్ల పువ్వులు చాలా సేపు తాజాగా కనిపిస్తాయి. కానీ మహిళలు వీటిని పెట్టుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. కాపర్ సల్ఫేట్ వల్ల పలు ఇబ్బందులకు గురి కాకూడదంటే.. మల్లె పువ్వులు కొనకుండా ఇతర పువ్వులు కొని పెట్టుకోవడం మంచిది. లేదంటే డేంజర్‌లో పడ్డట్టే.
Isn’t that blue water Copper sulphate
when you wear those flowers on ur hair they can cause skin allergies or they are even toxic pic.twitter.com/PwGnZ173cq— Swathi Bellam (@BellamSwathi) May 7, 2024