యూట్యూబ్‌ లవర్స్‌కి షాకింగ్ న్యూస్‌.. భారీగా పెరిగిన ధరలు

www.mannamweb.com


ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రతీ క్షణం వేల సంఖ్యలో కొత్త వీడియోలు అప్‌లోడ్ అవుతూనే ఉంటాయి. ఎంటర్‌టైన్‌మెంట్ మొదలు వార్తల వరకు అన్నింటికీ సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో చూడొచ్చు. ఇక యూట్యూబ్‌తో క్రియేటర్లు కూడా బాగా లాభపడుతున్నారు. తమ క్రియేటివితో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు.

ఈ క్రమంలోనే యూట్యూబ్ మరింత అడ్వాన్స్‌ సేవలను అందించే క్రమంలో యూట్యూబ్ ప్రీమియం పేరుతో సేవలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్స్‌క్లూజివ్‌ కంటెంట్‌తో పాటు, ఎక్కువ క్లారిటీతో కూడిన వీడియోలను వీక్షించే అవకాశం కల్పించారు. అలాగే ఎలాంటి ప్రకటనలు లేకుండా వీడియోలను వీక్షించే అవకాశం కూడా ఈ యూట్యూబ్ ప్రీమియం ద్వారా లభిస్తుంది. అయితే ఈ ప్రీమియం సేవలను ఉపయోగిస్తున్న వారికి యూట్యూబ్‌ తాజాగా షాకింగ్ న్యూస్‌ చెప్పింది. ప్రీమియం ఛార్జీలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

యూట్యూబ్ ప్రీమియం ఛార్జీలను గరిష్టంగా ఒకేసారి ఏకంగా రూ. 200 వరకు పెంచడం గమనార్హం. సుమారు 58 శాతం ధరలు పెరిగాయి. ప్రస్తుతం యూట్యూబీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను నెలవారీ, 3 నెలలు, 12 నెలల ప్లాన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. పెరిగిన ధరల వివరాల్లోకి వెళ్తే.. నెలవారీ ప్లాన్ ధర రూ.129 నుంచి రూ.149కి పెరిగింది. అదే సమయంలో విద్యార్థి నెలవారీ ప్లాన్ ధర రూ.79 నుంచి రూ.89కి పెరిగింది.

ఇక ఫ్యామిలీ మంత్లీ ప్లాన్ ధరను యూట్యూబ్‌ రూ.189 నుంచి రూ.299కి పెంచింది. వ్యక్తిగత ప్రీపెయిడ్ నెలవారీ ప్లాన్ ధర రూ.139 నుంచి రూ.159కి పెరిగింది. ఇది కాకుండా 3 నెలల ప్లాన్ ధర రూ.399 నుంచి రూ.459కి పెరిగింది. వార్షిక ప్లాన్‌ల ధరలను కూడా పెంచారు. ఈ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్ తీసుకున్న యూజర్లు ఎలాంటి యాడ్స్ లేకుండా వీడియోలను చూసే అవకాశం లభిస్తోంది. అలాగే వీడియోలను హై డెఫినేషన్‌లో కూడా చూసుకోవచ్చు.