పింఛన్‌దారులను షాక్ ఇస్తోన్న ఏపీ ప్రభుత్వం

www.mannamweb.com


గత ఎన్నికల్లో భారీ హామీలిచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఐదు నెలలు దాటింది.కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయిలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే పెన్షన్లను పంపిణీ చేస్తోంది.

అయితే పెన్షన్లను లబ్ధిదారుల సంఖ్య ప్రతి నెలకు తగ్గిపోతూ వస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన వారి కన్నా తక్కువ మందికి పెన్షన్ల ఇస్తున్నారు. పెన్షన్ల విషయంలో ప్రతినెల లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జగన్ ప్రభుత్వంలో మే నెలలో పెన్షన్ పంపిణీ 65 ,49 ,864కి పంపిణీ చేయగా, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 64,14,174 మందికి పెన్షన్‌ అందజేశారు.అయితే డిసెంబర్ నెలకు వచ్చే సరికి ఈ సంఖ్య 63 ,92 ,702మందికి చేరింది.

రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు ఉన్నారని కూటమి ప్రభుత్వం చెబుతోంది.పెన్షన్లను వేయి రూపాయిలు పెంచారని ఆనందపడేలోపే, లక్షల సంఖ్యలో పెన్షన్లను తొలగించి లెక్కలను సరి చేసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై ప్రశ్నిస్తే.. వైసీపీ హయంలో ఇష్టమొచ్చినట్టు పెన్షన్లు ఇచ్చారని సాకుగా చూపించి లబ్ధిదారుల తగ్గిస్తోందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్ల మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్దిదారులు ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుపై సర్వత్ర విమర్శలు వినిపిస్తున్నాయి.