మలబద్ధకం + షుగర్ + బరువు తగ్గడం అన్నింటికీ సింపుల్ చిట్కా

న వంటగదిలోనే ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో మసాలాలు ఉంటాయి. ఆహారాన్ని రుచిగా మార్చడానికి ఉప్పు, మిరియాలు, పసుపును ఉపయోగిస్తారు. వీటితో పాటు కొన్ని సుగంధ ద్రవ్యాలు కూడా వాడుతుంటారు.


ఇవి వంటకి రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇలా ఆరోగ్యానికి మేలు చేసే ఇంకోకటి ఉంది. అదే కసూరి మేథీ. దీన్ని మనం ఎన్నో వంటల్లో ఉపయోగిస్తాం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కసూరి మేథీ అంటే.. ఎండిన మెంతి ఆకుల పొడి. ఆయుర్వేదంలో మెంతి ఆకులను ఔషధంగా ఉపయోగిస్తారు. మెంతి ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, అలాగే ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇక, కసూరి మేథీ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో వ్యాధులకి చెక్ పెట్టడంలో సాయపడుతుంది. కసూరి మేథీని ఎలా తినాలి, ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది, దీని పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది

కసూరి మేథీలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది సహజంగా డయాబెటిస్‌ని నియంత్రించడంలో సాయపడుతుంది. ఈ ఎండిన ఆకులు రక్తంలో షుగర్ లెవల్స్‌ని నియంత్రించే లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఈ ఆకులు డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల్ని కంట్రోల్ ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచడం ద్వారా, ఇది టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రించడంలో సాయపడతుంది.

మలబద్ధకానికి చక్కటి పరిష్కారం

ఈ రోజుల్లో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫైబర్ అధికంగా ఉండే కసూరి మెథీ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. దీనిని తినడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకం చికిత్సకు బాగా సాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న కసూరి మేథి మంటను నియంత్రిస్తుంది. కడుపు ఉబ్బరం సమస్య నుంచి రిలీఫ్ అందిస్తుంది. దీంతో గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమస్యల్ని తగ్గించడంలో ప్రభావాన్ని చూపుతుంది.

ఊబకాయం

నేటి తరంలో ఊబకాయం దీర్ఘకాలిక వ్యాధిగా మారింది. ఊబకాయంతో బాధపడుతూ.. బరువు తగ్గాలనుకునేవారికి కసూరి మేథీ బెస్ట్ ఆప్షన్. ఈ ఆకుల్ని తినడం వల్ల బరువుని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఈ ఎండిన ఆకులు ఆకలిని నియంత్రించే జీవక్రియను పెంచే లక్షణాల్ని కలిగి ఉంటాయి. జీవక్రియను వేగవంతం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. ఈ ఆకులు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.

కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది

కసూరీ మేథీని వంటల్లో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించవచ్చు. ఈ ఆకులు చెడు కొలెస్ట్రాల్ (LDL)ను నియంత్రించే లక్షణాలను కలిగి ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించి.. మంచి కొలెస్ట్రాల్‌ని పెంచడంలో సాయపడతుంది. దీంతో, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇతర ప్రయోజనాలు

ఎండిన మెంతి ఆకులు రుతువిరతి, హార్మోన్ల మార్పులకు చికిత్స చేయడంలో సాయపడతాయి. ఇవి మహిళలకు అత్యంత సాధారణ సమస్యలు. మెంతి ఆకుల్లో కనిపించే సమ్మేళనాలు హార్మోన్ల మార్పులను నియంత్రించడంలో సాయపడతాయని నిపుణులు అంటున్నారు. తల్లి పాలను పెంచడానికి కసూరి మేథీ తీసుకోండి. కసూరి మేథీలో లభించే సమ్మేళనం పాలిచ్చే స్త్రీలలో పాలను పెంచడానికి సాయపడుతుంది.

కసూరి మేథీ ఎలా తీసుకోవాలి?

కసూరి మేథీని వంటల్లో తీసుకోవచ్చు. గరిష్ట ప్రయోజనాలను పొందడానికి, మీరు దీన్ని సలాడ్‌లు లేదా సూప్‌లలో జోడించవచ్చు. ప్రత్యామ్నాయంగా.. ఒక టీస్పూన్ కసూరి మేథీని ఒక కప్పు నీటిలో రాత్రంతా నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగవచ్చు. ఇక, పుల్కాలు లేదా చపాతీలు చేసుకునేటప్పుడు ఒక టీస్పూన్ కసూరి మేథీ కలపాలి. ఆ పిండితో చపాతీలు లేదా పుల్కాలు చేసుకుని తింటే ఆరోగ్యం మెరుగుపుడుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.