మీరు ప్రైవేట్ ఉద్యోగాల్లో పింఛను అందడం లేదని వర్రీ అవుతున్నారా. అయినా కూడా నో ప్రాబ్లమ్. ఎందుకంటే మీరు ఉద్యోగిగా కొనసాగుతూనే ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితాంతం పింఛన్ పొందే అవకాశం ఉంది.
అయితే అది ఎలా పొందవచ్చు. ఆ విశేషాలేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ(LIC) సరళా పింఛను పథకంలో మీరు ఒకసారి డబ్బును డిపాజిట్ చేయండి. 40 ఏళ్ల తర్వాత ప్రతి ఏటా మీకు రూ.12000 పింఛను లభిస్తుంది. మీరు జీవితాంతం ఈ పెన్షన్ ప్రయోజనం పొందుతారు. ఇందులో 60 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే ఏటా రూ.58,950 వస్తుంది. ఈ పథకంలో పొందే పెన్షన్ మీ పెట్టుబడి మొత్తం మీద ఆధారపడి ఉంటుంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి కూడా పెన్షన్ తీసుకునే సౌకర్యం ఉంది. మీ అవసరాన్ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు.
ఈ పెన్షన్ పథకాలను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో తీసుకోవచ్చు. ఈ పథకంలో సంవత్సరానికి కనీసం 12000 రూపాయల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది. ఇందులో గరిష్ట పెట్టుబడికి పరిమితి లేదు. ఈ పథకం 40 నుంచి 80 ఏళ్ల మధ్య వారికి వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో పాలసీదారు పాలసీ ప్రారంభించిన తేదీ నుంచి 6 నెలల తర్వాత ఎప్పుడైనా లోన్ కూడా పొందవచ్చు.
ఈ పాలసీ ఒక వ్యక్తికి సంబంధించినది. పెట్టుబడిదారుడు అంటే పెన్షనర్ జీవించి ఉన్నంత వరకు, అతను పెన్షన్ పొందుతూనే ఉంటాడు. పెట్టుబడిదారుడు మరణించిన తర్వాత, నామినీ మూల ప్రీమియం అందుకుంటారు.