ఒకటో తరగతిలో చేరాలంటే ఆరేళ్ల వయస్సు తప్పనిసరి: రాష్ట్రాలకు కేంద్రం సూచన

www.mannamweb.com


న్యూ ఢిల్లీ: ఒకటవ తరగతిలో ఆడ్మిషన్ పొందాలంటే ఆరేళ్ల వయస్సు కనీసంగా ఉండాలని కేంద్రం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.2024-25 విద్యాసంవత్సరం నుండి ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టుగా కేంద్రం ప్రకటించింది.
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 నిబంధనల ప్రకారంగా ఒకటవ తరగతిలో చేరే చిన్నారులకు ఆరేళ్ల వయస్సు ఉండాలని కేంద్రం సూచించింది.ఈ మేరకు ఈ నెల 15న కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు సమాచారం పంపింది.అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కచ్చితంగా ఈ విధానాన్ని పాటించాలని ఆ నోటీసులో కేంద్రం కోరింది.
2024-25 విద్యాసంవత్సరంలో ఒకటవ తరగతిలో చేరే విద్యార్థులకు కనీసం ఆరేళ్లు ఉండాల్సిందేనని కేంద్రం ఆ నోటీసులో తేల్చి చెప్పింది.ఎన్ఈపీ 2020 ప్రకారంగా ఫ్రీ స్కూల్ 3 నుండి ఐదేళ్ల మధ్య ఉంటుంది. ఆ తర్వాత 1వ తరగతిలో విద్యార్థులు చేరుతారు.1వ, తరగతిలో ప్రవేశానికి సంబంధించి ఆయా రాష్ట్రాల్లో విద్యార్థుల వయస్సుల్లో మధ్య తేడా ఉన్న విషయాన్ని కేంద్రం గుర్తించింది. 2022 మార్చి లో మంత్రిత్వ శాఖలో లోక్‌సభలో ఒక ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
ఢిల్లీ, అసోం వంటి రాష్ట్రాల్లో ఆరేళ్ల వయస్సు లేని విద్యార్థులకు కూడ ఒకటవ తరగతిలో ప్రవేశం కల్పించిన విషయాన్ని కేంద్రం పేర్కొంది.పాండిచ్చేరి, లడఖ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఒకటవ తరగతిలో చేరే విధ్యార్థుల వయస్సులో తేడా ఉందని కేంద్రం తెలిపింది.

కొన్ని రాష్ట్రాల్లో చిన్నారులను స్కూళ్లకు పంపేందుకు పేరేంట్స్ పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతుంటారు. ఇంటి వద్ద గడపాల్సిన బాల్యాన్ని స్కూళ్ల పేరుతో చిదిమేస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు అయితే ఐదేళ్లలోపు వయస్సున్న చిన్నారులను స్కూళ్లకు పంపకపోీతే భవిష్యత్తుల్లో ఉద్యోగాలకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పేరేంట్స్ భయపడుతున్నారు. ఒకటవ తరగతిలో చేరాలంటే ఆరేళ్ల వయస్సు ఉండాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లేఖలు పంపింది.ఈ నిబంధనను పాటించాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా ఒకటవ తరగతిలో చేరే విద్యార్థుల వయస్సులో వ్యత్యాసం ఉండదని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.