అందరూ స్మార్ట్ గ్యాడ్జెట్స్ అంటే ఇప్పుడు చాలా మక్కువ చూపిస్తున్నారు. అయితే స్మార్ట్ గ్యాడ్జెట్ అంటే కేవలం ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచెస్ మాత్రమే కాదండోయ్.. ఇంకా చాలానే గ్యాడ్జెట్స్ ఉంటాయి. అవి మీ డైలీ లైఫ్ ని ఎంతో ఈజీ చేస్తూ ఉంటాయి. ఇంకొన్ని మాత్రం మీకు గ్రేట్ కంపానియన్ లా కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాంటి కేటగిరీకి చెందిన ఒక స్మార్ట్ ఫ్లవర్ పాట్ ని అయితే మీకోసం తీసుకొచ్చాం. ఇది అలాంటి ఇలాంటి పూల కుండీ కాదు. చాలా బుజ్జిగా క్యూట్ గా ఉండే బాగా తెలివైన పూల కుండీ అనమాట. కేవలం మొక్కని పెంచుకోవడం మాత్రమే కాదు.. ఇంకా చాలా రకాలుగా ఈ బుజ్జి కుండీ అయితే ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వర్క్ ప్లేస్ కి బాగా సూట్ అవుతుంది.
ఈ స్మార్ట్ కుండీ పేరు.. స్మార్ట్ ప్లాంట్ ఐవీ. ఇందులో చాలానే ఫీచర్స్ అండ్ యూజ్ ఫుల్ విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది మీ వర్క్ ప్లేస్ కి చాలా సూటబుల్ పాట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఆఫీసుల్లో డెస్కుల దగ్గర చిన్న చిన్న ప్లాంట్స్ ని పెట్టుకుంటున్నారు. అలాంటి మినీ ప్లాంట్స్ ఈ స్మార్ట్ ఐవీ పాట్ లో పెట్టుకోవచ్చు. ముందు మీరు ఇందులో నీళ్లు పోసి అందులో మొక్కని పెట్టాలి. ఆ తర్వాత అందులో ఎలాంటి మొక్క పెట్టారో ఐవీ యాప్ లో అప్ డేట్ చేయాలి. ఆ తర్వాత మీకు ఈ మొక్క గురించి మాత్రమే కాకుండా.. చుట్టూ ఉన్న వాతావరణం గురించి కూడా ఈ ఐవీ పాట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది.
ఐవీ ఫీచర్స్:
ఈ స్మార్ట్ ప్లాంట్ పాట్ మొక్కకు నీళ్లు కావాలి అంటే ముందుగానే చెప్పేస్తుంది. వాటర్ కావాలి అని ఇండికేట్ చేస్తుంది. అలాగే తనకు వేడిగా ఉన్నా.. చల్లగా ఉన్నా చెప్పేస్తుంది. దానిని బట్టి మనం ఆ కుండీని ప్లేస్ ఛేంజ్ చేసుకోవచ్చు. మీరు మొక్కకు నీళ్లు పోస్తున్నప్పుడు డిస్ ప్లే మీద క్యూట్ క్యూట్ రియాక్షన్స్ వస్తాయి. అలాగే మీరు ఆ స్మార్ట్ కుండీని పట్టుకున్నప్పుడు కితకితలు పెట్టినట్లు రియాక్ట్ అవుతుంది. మీరు ఈ స్మార్ట్ పాట్ లో కేవలం డేట్, టైమ్ మాత్రమే కాకుండా ఉష్ణోగ్రత వివరాలు, గాలిలో ఉండే తేమ శాతం (హ్యూమిడిటీ) వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఇందులో పోమోడోరో టైమర్ కూడా ఉంటుంది. మీరు మీకు కావాల్సినంత టైమ్ సెట్ చేసుకుని మీ సమయాన్ని ఉపయోగకరంగా మార్చుకోవచ్చు. అలాగే ఇందులో చాలానే క్యూట్ యానిమేషన్స్ ఉంటాయి. ఇది టైప్ సీ ఛార్జర్ తో వస్తుంది.