Spiritual: దేవుడిని పూజించేటప్పుడు ఈ 5 పెద్ద తప్పులు చేస్తే మీ కలలు ఎప్పటికీ నెరవేరవు.. అవేంటంటే..

www.mannamweb.com


Spiritual: హిందూమతంలో ఏదైనా దేవుణ్ణి, దేవతను ఆరాధించడానికి కొన్ని నిర్దిష్ట నియమాలు రూపొందించడం జరిగింది. భగవంతుడి కృపను పొందడం, వారి ఆశీర్వాదాలు పొందడం చాలా ముఖ్యం.
ఇది లభిస్తే.. ఆటొమాటిక్‌గా జీవితంలో విజయం సాధిస్తారని విశ్వాసం. అయితే, పూజా విధానాలను విస్మరించే వారు.. ఏళ్ల తరబడి పూజలు చేసినా వాటి ఫలాలు లభించవంటున్నారు వేద పండితులు. పూజకు సంబంధించిన నియమాలు విస్మరించడం ద్వారా వారి కోరికలు ఎన్నటికీ నెరవేరవని, తప్పుగా పూజలు చేస్తే అపరాధ భావంతో ఉంటారని పేర్కొంటున్నారు.

1. మత గ్రంధాల ప్రకారం.. ఏ దేవుడినైనా పూజించేటప్పుడు.. దీపం, నీటి కుండను పక్కపక్కన ఉంచకూడదు. పూజకు ఉపయోగించే కలశాన్ని, నీటి పాత్రను ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉంచాలి. దేవతలకు దీపం ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచాలి.

2. దేవుడిని పూజించేటప్పుడు వాడిన, వాడిపోయిన లేదా కుళ్ళిన పువ్వులు సమర్పించకూడదు. ఎప్పుడూ వికసించే పువ్వులనే దేవుడికి సమర్పించాలి. అలాగే పూజలో నిషిద్ధమని భావించే పూలను ఎప్పుడూ ఉపయోగించకూడదు.

3. హిందూ మతంలో ఏ దేవత పూజలోనైనా ఆసనాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవతా ఆరాధనలో, ఒక నిర్దిష్ట దేవత లేదా నవగ్రహానికి సంబంధించిన రంగుల ఆసనాన్ని ఎల్లప్పుడూ ఉపయోగించాలి. శ్రమ లేకుండా నేలపై కూర్చొని పూజ చేసిన వారికి ఫలాలు దక్కవని విశ్వాసం.

4. దేవుణ్ణి ఆరాధించడంలో ఎప్పుడూ గర్వం ప్రదర్శించొద్దు. ఇలా చేస్తే.. పూజలు చేసినా ఫలితం ఉండదు. భగవంతుని ఆరాధన ఎల్లప్పుడూ ఏకాంతంగా, నిర్మలమైన మనస్సుతో చేయాలి.

5. దైవారాధనలో ముఖ్యమైన నియమం ఏంటంటే భగవంతుడిని ఎల్లప్పుడూ ప్రశాంతంగా, స్వచ్ఛమైన మనస్సుతో పూజించాలి. భగవంతుడిని పూజించేటప్పుడు మనసును ఇతర విషయాలపై మళ్లించకూడదు. ఎవరిపైనా కోప్పడకూడదు. భగవంతుడిని పూజించడం వల్ల మనసులో తప్పుడు భావోద్వేగాలు వస్తే ఫలితం ఉండదనే విశ్వాసం బలంగా ఉంది.