SSY: చిన్న పొదుపులతో మీ కూతురికి రూ.69 లక్షలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు..!

www.mannamweb.com


Sukanya Samriddhi Yojana: ఒకప్పుడు ఆడ పిల్ల పుట్టిందంటే చాలా బాధ పడే వారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి చాలా వరకు మారింది. ఇప్పుడు ఆడ, మగ తేడా ఏం లేదు. ఎవరైనా ఒక్కటే అని అనుకుంటున్నారు. అయినప్పటికీ అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు కట్నం తప్పనిసరిగా మారింది. చట్టం ప్రకారం కట్నం తీసుకోవడం నేరమైనప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇప్పుడు ఆడ పిల్ల పుట్టగానే వారి పేరు పొదుపు చేయడం మొదలు పెడుతున్నారు.
అయితే ఆడ పిల్ల పేరుపై పొదుపు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి సుకన్య సమృద్ధి యోజన పథకం మంచి ఎంపికగా ఉంటుంది. ఈ పథకం కేవలం ఆడ పిల్లల కోసం ప్రవేశపెట్టారు. 10 ఏళ్ల లోపు ఉన్నవారే ఈ పథకంలో చేరవచ్చు. పాప పుట్టినప్పటి నుంచి పథకంలో చేరవచ్చు. కానీ పాపకు ఆధార్ కార్డు రావాలంటే టైమ్ పడుతుంది. ఆధార్ కార్డు వచ్చిన తర్వాత పథకంలో చేరవచ్చు.
ఈ పథకంలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.250 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. సుకన్య సమృద్ధి యోజనలో చేరిన నుంచి 15 సంవత్సరాలు పొదుపు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ రేటు కొనసాగుతోంది. ఇది ప్రభుత్వ పథకం. ఇందులో కచ్చితమైన రాబడి ఉంటుంది. పాకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు పొదుపు చేసిన మొత్తంలో సగం వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది.
దీన్ని ఒకేసారి తీసుకోవచ్చు.. లేదా వాయిదాల్లో తీసుకోవచ్చు. ఉదాహణకు పాప వయస్సు ఐదేళ్లు ఉన్నప్పుడు సుకన్య సమృద్ధి యోజనలో చేరితే.. పాపకు 20 వచ్చ వరకు పొదుపు చేయాలి. మీరు సంవత్సరానికి రూ.1.50 వేలు పొదుపు చేస్తే 15 సంవత్సరాల్లో రూ.22,50,000 చెల్లిస్తారు. మధ్యలో విత్ డ్రా చేసుకోకుంటే.. పాపకు 25 సంవత్సరాలకు అస్సలు రూ.22,50,000, వడ్డీ రూ.46,77,578 మొత్తం కలిపి రూ.69,27,578 వస్తాయి.
మీరు 2024 పెట్టుబడి ప్రారంభిస్తే.. 2045లో మీ పాపకు మెచ్యూరిటీ సొమ్ము వస్తుంది. సుకన్య సమృద్ధి యోజనలో పొదుపు చేస్తే పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.