పట్టుదల ఉంటే చాలు ఏదైనా సాధ్యమే, చదువు అనేది మనలో సంస్కారాన్ని, క్రమశిక్షణను పెంచడానికి మాత్రమే అని నిరూపించాడు ఓ 26 ఏళ్ల కుర్రాడు. చదివింది పదో తరగతి, అయినా ఐటీ రంగంలో తనదైన శైలిలో రానిస్తున్నారు. ఐటీ రంగంలో రానించాలంటే డిగ్రీ పట్టాలతో పనిలేదని, ప్రతిభ ఉంటే చాలు అని నిరూపించి, ఎవరూ ఊహించని రీతిలో.. ఐటీ రంగంలో దూసుకెళ్తున్నాడు కిషన్ బగారియా అనే 26 ఏళ్ల యువకుడు.
వివరాల్లోకి వెళితే.. అస్సాం రాష్ట్రానికి చెందిన కిషన్ బగారియా పదవ తరగతితో తన చదువుని ఆపేశారు. అయితే తాను ఏడవ తరగతిలో ఉన్నప్పటినుండే అనేక ఆన్లైన్ కోర్సులు నేర్చుకున్నారు. కాగా ఆన్లైన్ కోర్సులు మీద గ్రిప్ సాధించిన కిషన్, మేనేజింగ్ యాప్‌లు అన్నీ ఒకే చోట ఓపెన్ అయ్యేలా టెక్స్ట్ డాట్ కామ్ (Texts.com) అనే వెబ్‌సైట్‌ను రూపొందించారు.
కాగా కిషన్ రూపొందించిన వెబ్‌సైట్, వోర్డ్ ప్రెస్ డాట్ కామ్ (wordpress.com) అధినేత మ్యాట్‌కు నచ్చడంతో కిషన్ వెబ్‌సైట్‌ను ఏకంగా 4 వందల కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. అలానే ఆ విభాగానికి కిషన్‌ని హెడ్‌గా నియమించారు.