Success Story: రూ.500తో ముంబైలో అడుగుపెట్టి రూ.5,000 కోట్ల సంపాదన..

www.mannamweb.com


Dr.A. Velumani: అందరి దారి వేరు ఆయన ఒక్కడి దారు వేరు. పేదరికంలో పుట్టి పెరగటమే తన విజయానికి నిజమైన బలమని చెబుతారు డాక్టర్ వేలుమణి. తమిళనాడులో పుట్టి పెరిగిన ఆయన ఉద్యోగం కోసం ముంబై వెళ్లి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన తీరు ఖర్చితంగా నేటి యువతకు పెద్ద పాఠం.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దేశంలో అతిపెద్ద థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిన థైరోకేర్ సంస్థ ఫౌండర్ డాక్టర్ ఆరోగ్యసామి వేలుమణి ప్రయాణం గురించే. కోయంబత్తూరులో ఫ్రెషర్ కావటంతో 50 ఉద్యోగాలకు రిజెక్ట్ అయ్యాక ఒక జాబ్ వచ్చింది. కంపెనీ మూతపడటంతో రూ.500తో ముంబైలో ప్రభుత్వ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చి సెలక్ట్ అయ్యారు. అక్కడే పీహెచ్డీ వరకు చదువు పూర్తి చేశారు.

ఉద్యోగం మానేయాలని తీసుకున్న సడెన్ నిర్ణయం నుంచి పుట్టిందే వ్యాపార ఆలోచన. అప్పట్లో రూ.2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ఆయన థైరాయిడ్ టెస్టింగ్ గురించి తన చదువులో నేర్చుకున్న కీలక విషయాలతో తక్కువ ధరకే టెస్టింగ్ సేవలను అందించటం ప్రారంభించారు. తొలుత ఫాంచైజింగ్ మోడల్ లో నాణ్యమైన సేవలను సరసమైన ధరలకు అందించి దేశమంతటా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే తన కంపెనీలో కేవలం ఫెషర్లకు మాత్రమే ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించుకుని దానినే కొనసాగించారు.

కరోనా సమయంలో దేశంలో టెస్టింగ్ కోసం తొలుత కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం పొందిన తొలి ప్రైవేట్ ల్యాబొరేటరిగీ థైరోకేర్ నిలిచింది. అలా ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా 40 శాతం లాభాలతో కంపెనీని ఏకండా 25 ఏళ్లకు పైగా నిరంతంగా వృద్ధి చెందేలా చేశారు వేలుమణి. భార్య సాయంతోనే తానింతటి వాడనయ్యానని ఎప్పుడూ గుర్తుచేసుకుంటారు. తన ప్రయాణంలో తనను ముందుకు నడిపిన చాలా మందికి కృతజ్ఞతలు చెబుతుంటారు. అలా కేవలం రూ.500తో ముంబైలో ప్రారంభమైన ప్రయాణం కంపెనీని భార్య మరణం తర్వాత 2016లో రూ.5000 కోట్లకు విక్రయించి ముగించారు. ప్రస్తుతం దేశంలోని అనేక మంది యువ వ్యాపారవేత్తలకు గైడెన్స్ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వ్యాపారంలో వేగం కంటే విజయం సాధించటం ముఖ్యమని ఆయనను చూస్తేనే తెలుస్తుంది.