స్వచ్ఛ భారత్‌కు పదేళ్లు పూర్తి..ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

www.mannamweb.com


నేడు గాంధీ జయంతి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా గాంధీజికి ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నారు. అక్టోబర్ 2తో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు 10 ఏళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి కోట్లాది మంది భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే స్వచ్ఛ భారత్‌ మిషన్‌ నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది.

స్వచ్ఛ భారత్ అభియాన్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రధాని ప్రశంసించారు. ఈ ఉద్యమం విజయవంతం కావడానికి కృషి చేసిన వారందరికీ నా వందనాలు” అని సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు. అయితే స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత విషయంలో ఎన్నో విజయాలు సాధించామని, దేశంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛభారత్‌ను స్వాగతించి వారి వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేందుకు ఎంతో కృషి చేశారన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఎంతో మద్దతు ఇచ్చారని ప్రశంసించారు.

అయితే స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ప్రారంభించి 10 ఏళ్లు పూర్తవుతుండగా, నేడు గాంధీ జయంతి నేపథ్యంలో చిన్నారులతో కలిసి ప్రధాని మోదీ స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. మీ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అభ్యర్థించారు.

ఈ చర్య స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని మోడీ అన్నారు. స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమం గత దశాబ్దంలో భారతదేశం సాధించిన పరిశుభ్రత విజయాలను మోడీ తెలియజేశారు.