Swift Facelift 2024: మార్కెట్లోకి వచ్చిన కొత్త స్విప్ట్.. ఫీచర్స్, ధర తెలిస్తే షాక్ అవుతారు..

www.mannamweb.com


Swift Facelift 2024: దేశంలో మారుతి కార్ల జోరు రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ కంపెనీకి పోటీగా ఎన్నో వచ్చినా మారుతి మాత్రం కొత్త కొత్త మోడళ్లతో ఆకర్షిస్తుంది.
ఎప్పటికప్పుడు అప్డేట్ ఫీచర్స్ తో కార్లను తీసుకొస్తోంది. మారుతి సుజుకీ నుంచి రెండేళ్ల కిందట రిలీజ్ అయిన స్విప్ట్ గురించి చాలా మందికి తెలుసు. ఈ కారు 2023 లోనూ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. అయితే స్విప్ట్ ను సరికొత్త మోడల్ లో తీసుకొస్తున్నట్లు మారుతి ఇప్పటికే ప్రకటించింది. 2024లో దీనిని ఫేస్ లిప్ట్ గా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పినట్లుగా ఫిబ్రవరి 9న రిలీజ్ చేసింది. సరికొత్త లుక్ తో పాటు అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో ఉన్న ఈ కారు గురించి వివరాల్లోకి వెళితే..

మారుతి ఫేస్ లిప్ట్ 2024 లేటేస్ట్ టెక్నాలజీతో నిర్మించబడింది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, రివర్స్ కెమెరా పవర్ స్టీరింగ్ మోడ్ ఆకర్షస్తాయి. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీ ఉన్నాయి. వెలుతురు కోసం ఎల్ ఈడీ ల్యాంప్స్ ఉన్నాయి. మారుతి ఫేస్ లిప్ట్ 2024 1.2 లీటర్ మూడు సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో కూడుకొని ఉంది. లీటర్ పెట్రోల్ కు రూ.22 కోలోమీటర్ల మైలేజ్ ఇస్తోంది.
మారుతి స్విప్ట్ రూ.5.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. కానీ ఫేస్ లిప్ట్ 2024 ధర మాత్రం వెల్లడించలేదు. కానీ రూ.6.50 లక్షల ప్రారంభ ధర నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంకా ఇందులో శక్తివంతమైన ఇంజిన్ ఉంటుందని అంటున్నారు. కాగా ఫేస్ లిఫ్ట్ 82 బీహెచ్ పీ పవర్ తో పాటు 108 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు సీవీటీ గేర్ బాక్స్ సౌకర్యం కూడా కలిగి ఉంది.

గతంలో దీనిని జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు. తాజాగా ఫిబ్రవరి 9న ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ కారు లీటర్ కు 30 నుంచి 35 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంది. కొత్త స్విప్ట్ లో ప్రస్తుతం కె సిరీస్ కంటే కొత్తగా ఉంది. ఇన్నర్ స్పేస్ ను కూడా పెంచారు. అలాగే ఇందులోని ఇంజిన్ బలమైనదిగా తెలుస్తోంది. పాత స్విప్ట్ కంటే మెరుగైనదిగా కనిపిస్తోంది లాంగ్ టూర్ వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు.