టీ20 వరల్డ్‌కప్‌నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
T20 jersey | ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌కు జట్టును ప్రకటించినప్పటినుంచి ఈసారి జెర్సీ (T20 jersey) ఎలా ఉండబోతోందో అంటూ టీమిండియా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న వేళ ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్, కిట్ స్పాన్సర్ అడిడాస్ (Adidas) జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. హెలికాప్టర్ సాయంతో జెర్సీని ప్రదర్శిస్తుంటే.. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మైదానం నుంచి ఆసక్తికరంగా వీక్షిస్తున్నట్లు వీడియోను రూపొందించింది.
ఈ కొత్త జెర్సీ.. నీలం, కాషాయం రంగులు కలగలిపి ఉంది. ‘వి’ షేప్ నెక్ ఉంది. మే 7 నుంచి జెర్సీలు స్టోర్లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది. అడిడాస్ అధికారికంగా జెర్సీని ఆవిష్కరించకముందే సంబంధిత చిత్రాలు నెట్టింట దర్శనమిచ్చాయి. దీంతో అధికారికంగా ప్రకటించిన వెంటనే ‘మాకు ముందే తెలుసులేవోయ్’ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘ముందు మీ పీఆర్ టీమ్ ఫైర్ చేయండి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. జెర్సీ బాగుందంటూ కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ కలర్ కాంబినేషన్‌పై అసహనం వ్యక్తంచేస్తున్నారు. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
భారత్ కొత్త కిట్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అడిడాస్ పోస్ట్ చేసిన వీడియోను బీసీసీఐ రీ ట్వీట్ చేసింది. ‘ఒక జెర్సీ. వన్ నేషన్. టీ20 ప్రపంచకప్ 2024 కోసం టీమిండియా కొత్త టీ20 జెర్సీని ప్రజెంట్ చేశాం. మే 7వ తేదీ ఉదయం 10 గంటలకు అడిడాస్ స్టోర్‌లలో మరియు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి’ అని బీసీసీఐ పేర్కొంది.
View this post on Instagram