క్రికెట్ కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు ఐసీసీ అప్పుడప్పుడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా రూల్స్ అండ్ రెగ్యూలేషన్స్ లో మార్పులు చేర్పులు కూడా చేస్తుంది. తాజాగా టీ20 వుమెన్స్ వరల్డ్ కప్ 2024కు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ డెసిషన్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మహిళా క్రికెట్ కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. మరి ఇంతకీ క్రికెట్ పెద్దన్న తీసుకున్న ఆ డెసిషన్ ఏంటి? చూద్దాం పదండి.
వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024 త్వరలోనే దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వరల్డ్ కప్ మ్యాచ్ లకు 18 ఏళ్ల లోపు ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ కల్పించనుంది. మహిళా క్రికెట్ కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు ఈ డెసిషన్ తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. దీంతో 18 ఇయర్స్ బిలో క్రికెట్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్ లకు కనీస టికెట్ ధరను 5 దిర్హమ్ లుగా నిర్ణయించారు. అంటే భారత కరెన్సీలో దీని విలువ 115 రూపాయాలు అన్నమాట. ఇదిలా ఉండగా.. ఇటీవలే శ్రీలంక వేదికగా ముగిసిన టీ20 ఆసియా కప్ కు కూడా ప్రేక్షకులందరికీ ఫ్రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఐసీసీ 18 సంవత్సరాల లోపు వారికి ఈ అవకాశం కల్పించింది.
ఇక ఈ టోర్నీ అక్టోబర్ 3 నుంచి 20 వరకు దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీలో 10 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఉండగా.. మరోవైపు గ్రూప్-బిలో సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ఉన్నాయి. ఇక అక్టోబర్ 4 నుంచి భారత్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. టీమిండియా తన తొలి మ్యాచ్ ను న్యూజిలాండ్ తో ఆడనుంది. ఆ తర్వాత 6వ తారీఖున చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఢీకొంటుంది. ఇక ఈ మెగాటోర్నీ కోసం ఇప్పటికే ఎన్సీఏలో ప్రాక్టీస్ మెుదలుపెట్టారు మహిళా క్రికెటర్లు. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో ఉన్నారు.