ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త!

www.mannamweb.com


Central Govt: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం అదిరే శుభవార్త!

ఏదైనా ప్రభుత్వంలో కీలకమైనది ఉద్యోగులు. వీరు అనేక శాఖల్లో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తుంటారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంధాన కర్తగా ఉంటారు.

ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అనేక రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలానే ప్రభుత్వం నుంచి వీరికి వివిధ రకాల అలవెన్స్ లు వస్తుంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెబుతుంటాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం అదిరే శుభవార్త చెప్పింది. వీరి జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఇటీవలే కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన ఉద్యోగులకు తొలిసారి గుడ్ న్యూస్ చెప్పనుందని తెలుస్తోంది. ఉద్యోగుల వేతనాలు భారీగా3 పెరగవచ్చని సమాచారం. ఇదే జరిగితే చాలా మందికి ఉద్యోగులు భారీ ఉపశమనం లభించినట్లు అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇప్పటి వరకు డీఏ 4 శాతం పెరిగిం. దీంతో డీఏ 50 శాతానికి చేరింది. డ్రాఫ్ట్ అలవెన్స్ అనేవి ఏటా పెరుగుతాయనే విషయం తెలిసింది.

ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు డీఏను పెంచనుంది. ఇలా ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులకే కాకుండా…పదవీ విరమణ చేసిన వారికి కూడా డీఆర్ అనే అలెవెన్స్ పెరుగుతుంది. వీరికి కూడా 4 శాతం పెంపుతో 50కి చేరింది. ఇక డీఏ, డీఆర్ ల పెంపు వల్ల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పెన్షన్ లు పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో డీఆర్, డీఏల తో పాటు మరికొన్ని అలవెన్సులు కూడా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ అలవెన్సుల్లో ఇంటి అద్దె అలవెన్స్ కూడా ఉంటాయి. సవరించిన జీతాల ప్రకారం.. చెల్లించాల్సిన డీఆర్ 50 శాతం పెరినప్పుడు, భత్యం 25 శాతం పెంచపబడుతాయి. అదే విధంగా ట్రాన్స్ పోర్టు అలవెన్సు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, వికలాంగ మహిళల పిల్లలకు ప్రత్యేక భత్యం ఉంటుంది.

వీటితో పాటు చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇంటి అద్దె అలవెన్స్, డ్రెస్ అలవెన్స్, స్లిప్ డ్యూటీ అలవెన్స్, డిప్యుటేషన్ అలవెన్స్ కూడా పెరగనున్నట్లు సమాచారం. ఇలా ఇవి అన్నీ పెరిగితే ఉద్యోగుల జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా శుభవార్త అందనున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రకాల సదుపాయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వివిధ రకాల అలెవన్సులు ఉంటాయి. ముఖ్యంగా డీఏలు, డీఆర్ లో అనేవి ఉద్యోగుల జీతంపై ప్రభావం చూపుతాయి. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు వీటిపై ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.