Mahesh Babu: వారసుడు వచ్చేస్తున్నాడు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని తాత, తండ్రి అడుగుజాడల్లోనే నడిచేందుకు రెడీ అయ్యాడు. నటనకు సంబంధించి ఇప్పటికే న్యూయార్క్ లో శిక్షణ తీసుకుంటున్నాడీ స్టార్ కిడ్. తాజాగా గౌతమ్ యాక్టింగ్ చేసిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని బయట పెద్దగా కనిపించడు. అదే సమయంలో సితార ఘట్టమనేని మాత్రం ఇప్పటికే మోడలింగ్, ఇంటర్వ్యూలు, డ్యాన్స్ వీడియోలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే గౌతమ్ కూడా తాత, తండ్రి అడుగు జాడల్లోనే నడిచేందుకు రెడీ అయ్యాడు. గతంలో మహేశ్ నటించిన ‘వన్ నేనొక్కడినే’ మూవీలో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసిన గౌతమ్ రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం న్యూయార్క్ లో యాక్టింగ్ కోర్సు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో గౌతమ్ యాక్టింగ్ చేసిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. న్యూయార్క్ లోని టిస్క్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ చేస్తోన్న గౌతమ్ తన తోటి స్నేహితులతో కలిసి ఓ స్కిట్ చేశాడు. ఇందులో గౌతమ్..ఓ అమ్మాయితో కలిసి కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ కనిపించాడు. తన గర్ల్ ఫ్రెండ్ మీద అరిచే బాయ్ ఫ్రెండ్ గా మొదట నవ్వుతూ, ఆ తర్వాత కోప్పడుతూ ముఖంలో భావోద్వేగాలను బాగా పలికించాడు గౌతమ్. ఈ వీడియోలో ఎలాంటి మాటలు లేకుండానే కేవలం ఎక్స్‌ ప్రెషన్ తోనే ఆకట్టుకున్నాడు మహేష్ తనయుడు. బ్రెయిన్ వాషింగ్ పేరుతో తెరకెక్కిన ఈ వీడియోను సెరాఫీనా జేరోమి రూపొందిచగా.. కాశ్వీ ర‌మ‌ణి, గౌత‌మ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

ప్రస్తుతం గౌతమ్ యాక్టింగ్ వీడియో మహేష్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఘట్టమనేని వంశం నుంచి మూడో త‌రం సినిమా ఇండ‌స్ట్రీలోకి రాబోతుందంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు సితార కూడా జెట్ స్పీడ్ లో దూసుకొస్తోంది. ఇప్పటికే పలు యాడ్లలో నటిస్తూ ఫేమస్ అయిన ఈ స్టార్ కిడ్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తానికి మహేశ్ వారసులిద్దరూ త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారన్న వార్త ఘట్టమనేని అభిమానులకు ఎనలేని సంతోషాన్నిస్తోంది.