మహిళా గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీ గుడ్ న్యూస్

దేశ సేవ చేయాలని.. ఆర్మీ యూనిఫాం ధరించాలని కలలు కనే మహిళలకు ఇండియన్ ఆర్మీ సువర్ణావకాశం అందిస్తుంది. ఇటీవల కాలంలో రక్షణ రంగంలో మహిళలకు అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి.


ఒకప్పుడు పరిమితంగా ఉన్న ఈ రంగం ఇప్పుడు మహిళలకు కూడా విస్తృతంగా తలుపులు తెరిచింది. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా సాధారణ డిగ్రీ ఉన్నా సరే, సరైన అర్హతలు, కొంత టాలెంట్ ఉంటే చాలు-ఉద్యోగం మీ సొంతం అవుతుంది. జీతభత్యాలు కూడా ఊహించిన దానికంటే మెరుగ్గా ఉండడం విశేషం.

ఇండియన్ ఆర్మీ 67వ షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC – Technical) కింద ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ విభాగంలో మొత్తం 30 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులన్నీ పూర్తిగా మహిళలకే కేటాయించారు. మంచి జీతం, గౌరవప్రదమైన హోదా, స్థిరమైన భవిష్యత్ కోరుకునే మహిళలు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవచ్చు. ఇందుకు కావాల్సిన పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

అర్హతలు & దరఖాస్తు వివరాలు..

ఈ ఉద్యోగాలకు అవివాహిత మహిళా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే అర్హులు. B.Tech / BE పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు గడువు..

జనవరి 6, 2026 నుంచి ఫిబ్రవరి 4, 2026

దరఖాస్తు విధానం..

అభ్యర్థులు నేరుగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ joinindianarmy.nic.in లోనే అప్లై చేయాలని అధికారులు సూచించారు.

ఎంపిక ప్రక్రియ..

ఈ పోస్టులకు రాత పరీక్ష ఉండదు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా దశలవారీ ప్రక్రియలో జరుగుతుంది.

  • అప్లికేషన్ల ఆధారంగా షార్ట్‌లిస్ట్
  • SSB ఇంటర్వ్యూ
  • మెడికల్ పరీక్ష
  • మెరిట్ ఆధారంగా తుది ఎంపిక

ఈ ప్రక్రియలో విజయం సాధించిన అభ్యర్థుల ఫలితాలను మార్చి మొదటి వారంలో ప్రకటించే అవకాశం ఉంది.

ట్రైనింగ్ వివరాలు..

ఎంపికైన మహిళా అభ్యర్థులకు బీహార్ రాష్ట్రంలోని గయాలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

ట్రైనింగ్ వ్యవధి: 49 వారాలు

ట్రైనింగ్ కాలం: అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు

ట్రైనింగ్ సమయంలోనే అభ్యర్థులకు జీతం చెల్లిస్తారు, ఇది ఈ ఉద్యోగానికి మరింత ఆకర్షణగా మారింది.

ట్రైనింగ్ సమయంలో జీతం..?

ట్రైనింగ్ సమయంలోనే అభ్యర్థులకు నెలకు రూ.56,000కు పైగా జీతం అందనుంది. ఇది లెఫ్టినెంట్ హోదాకు అనుగుణంగా ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక అధికారికంగా లెఫ్టినెంట్ ర్యాంక్‌లో సేవలు ప్రారంభిస్తారు.

సర్వీస్ కాలం & భవిష్యత్ అవకాశాలు..

షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన అభ్యర్థులు కనీసం 10 సంవత్సరాలు సేవ చేయాలి. ఆ తర్వాత వారి పనితీరు, ఆసక్తిని బట్టి సర్వీస్‌ను పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆర్మీలో సేవ చేయడం ద్వారా గౌరవం, స్థిరమైన ఆదాయం, దేశ సేవ చేసే అవకాశంతో పాటు మంచి కెరీర్ గ్రోత్ లభిస్తుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.