టీవీ కేబుల్ ఆపరేటర్ జార్జ్‌కుట్టి పాత్రలో మోహన్ లాల్ నటించిన ఈ హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమా వస్తున్నట్లు ఈ స్టార్ హీరో ఒక వీడియోను పోస్ట్ చేశారు. హిందీ వెర్షన్ కంటే కొన్ని నెలల ముందే మలయాల వర్షన్ థియేటర్లలోకి రానుంది.
దృశ్యం 3 రిలీజ్ డేట్
మోహన్ లాల్ ‘దృశ్యం 3’ విడుదల తేదీని ప్రకటిస్తూ.. ”సంవత్సరాలు గడిచాయి. గతం మారలేదు. దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2, 2026న రిలీజ్ అవుతుంది” అని రాసుకొచ్చారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో పాతకాలపు టీవీ సెట్, పార, మునిగిపోయిన కారు, సెల్ ఫోన్, పసుపు రంగు బ్యాగ్, సీసీటీవీ కెమెరా, స్క్రిప్ట్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ మొదటి రెండు సినిమాల్లోని కీలక అంశాలుగా కనిపిస్తున్నాయి.
రహస్యం తిరిగి
పోస్టర్‌లో మోహన్ లాల్ నేరుగా కెమెరా వైపు చూస్తున్నారు. ఆయన వెనుక భార్య రాణి జార్జ్ (మీనా), కుమార్తెలు అంజు, అను (అన్సిబా హసన్, ఎస్తర్ అనిల్) నిలబడి ఉన్నారు. ‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు’ అనేది దృశ్యం 3 సినిమా ట్యాగ్‌లైన్.
”ప్రతి రహస్యానికి ఒక తిరిగి వచ్చే తేదీ ఉంటుంది. ఏప్రిల్ 2, 2026 – అప్పుడు నిజం బయటపడుతుంది” అని సినిమా అధికారిక సోషల్ మీడియా పేజీ పోస్టర్‌ను విడుదల చేస్తూ రాసింది.
దృశ్యం 3 గురించి
దృశ్యం 3కి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఆశీర్వాద్ సినిమాస్ నుండి ఆంటోనీ పెరుంబావూర్ నిర్మించారు. పెన్ స్టూడియోస్, పనోరమా స్టూడియోస్ నుండి జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పోలీసుల నుండి ఒక చీకటి రహస్యాన్ని దాచడానికి జార్జ్‌కుట్టి పడే కష్టాలను చూపించే హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడవ భాగం.
హిందీ వర్షన్
గత ఏడాది డిసెంబర్‌లో ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటించారు. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియా సరన్, టబు తదితరులు నటిస్తున్నారు. హిందీ వెర్షన్ కోసం విడుదల చేసిన ప్రకటన వీడియోలో మొదటి చిత్రంలోని సంఘటనలు జరిగి ఏడేళ్లు గడిచిందని సూచించారు. ఇప్పుడు హిందీ వర్షన్ కంటే ముందే మలయాళ దృశ్యం 3 రిలీజ్ అవుతుంది.


































