రాజాసాబ్-ప్రభాస్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఒక నెలలోపు OTT-స్ట్రీమింగ్‌లోకి రానుంది – ఇదే తేదీ.

ప్రభాస్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ‘ది రాజాసాబ్’. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ‘ది రాజాసాబ్’ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. సంక్రాంతి సందర్బంగా జవనరి 9న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. బంపర్ ఓపెనింగ్ సాధించిన ఈ మూవీ ఆ తర్వాత మిక్స్ డ్ టాక్ కారణంగా స్లో అయింది. చివరకు డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.


రాజాసాబ్ ఓటీటీ

వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ చేసిన హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ ‘ది రాజాసాబ్’. దీనికి మారుతి డైరెక్టర్. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఫిబ్రవరి 6 నుంచి తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాజాసాబ్ స్ట్రీమింగ్ కానున్నట్లు జియోహాట్‌స్టార్‌ లో చూపిస్తోంది.

నాలుగు భాషల్లో

ది రాజాసాబ్ మూవీ నాలుగు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటించారు. సంజయ్ దత్ కీలక పాత్ర పోషించాడు.

నెల రోజుల్లోపే

సుమారు రూ.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రాజాసాబ్ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.207 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే సాధించింది. పెట్టిన బడ్జెట్ తిరిగి రాబట్టలేని రాజాసాబ్ డిజాస్టర్ గా నిలిచింది. జనవరి 9న రిలీజైన ఈ మూవీ ఇప్పుడు నెల రోజుల్లోపే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 6 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

రాజాసాబ్ స్టోరీ

ఒకప్పుడు దేవనగర సంస్థానికి జమిందారు అయిన గంగాదేవి (జరీనా వాహబ్) సాధారణ జీవితం గడుపుతుంటారు. గంగాదేవితో మనవడు రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్) నివసిస్తాడు. నానమ్మ అంటే రాజుకు ఎంతో ఇష్టం. అయితే, గంగాదేవి అల్జీమర్స్‌తో బాధపడుతుంటుంది. కానీ, భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మాత్రం మరిచిపోదు.

కలలో కనిపించిన తాతను ఎలాగైనా వెతికి తీసుకురమ్మని రాజును కోరుతుంది నానమ్మ. ఈ క్రమంలోనే హైదరబాద్‌లో కనకరాజు ఉన్నట్లు తెలిసి రాజు బయలుదేరుతాడు. నర్సాపూర్ అడవిలోని రాజ మహల్‌కి రాజు కొంతమందితో వెళ్తాడు. ఆ బంగ్లాలో ఎన్నో మార్మిక విద్యలు తెలిసిన కనకరాజు.. రాజును చంపాలని చూస్తాడు.

మార్మిక విద్యలు తెలిసిన కనకరాజును రాజా సాబ్ ఎలా ఎదుర్కొన్నాడు? అసలు కనకరాజు గతమేంటీ? అతనికి ఏం కావాలి? రాజా సాబ్ లైఫ్‌లోకి వచ్చిన ముగ్గురు అమ్మాయిలు భైరవి (మాళవిక మోహనన్), బ్లెస్సీ (నిధి అగర్వాల్), అనిత (రిద్ధి కుమార్) ఎవరు? గంగాదేవి ఆస్తులు ఏమైపోయాయి? వారు సాధారణ జీవితం గడపడానికి కారణం ఏంటీ? బంగ్లా నుంచి రాజు బయటపడ్డాడా? అనేది తెలియాలంటే ది రాజా సాబ్ చూడాల్సిందే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.