సీజన్ లో దొరికే మామిడి పండ్లు, నేరేడు వంటి వాటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మామిడి పండ్లను తినడమే కాదు.. పచ్చి మామిడికాయలతో రకరకాల ఆహార పదార్ధాలను తయారు చేస్తారు. మామిడి కాయ చట్నీ, మామిడికాయ పన్నా , మామిడికాయ పప్పు వంటి వాటితో పాటు పండిన మామిడిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. అయితే మామిడి పండ్లను తిని వాటి టెంకలను (విత్తనాలను) పడేస్తారు. మామిడి పండు మాత్రమే కాకుండా దాని విత్తనం అంటే మామిడి టెంక కూడా చాలా ఉపయోగకరం. మామిడి టెంకతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. అయితే ఇలా మామిడి విత్తనం మాత్రమే కాదు ఇంకా రకరకాల పండ్ల విత్తనాలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజు ఆ పండ్లు ఏమిటి? వాటి గింజల వలన కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాం..
మామిడి టెంకలు: మామిడి పండు తిన్న తర్వాత దాని టెంకలను కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత టెంకకు ఉన్న పెంకును వేరు చేసి.. దాని లోపల ఉన్న జీడిని తీసి, ఎండబెట్టి పొడిని తయారు చేసుకోవాలి. ఈ చుర్నాన్ని తేనెతో కలిపి సేవించవచ్చు. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
నేరేడు పండు గింజలు: ప్రస్తుతం నేరేడు పండ్ల సీజన్ కొనసాగుతోంది. ఈ పండ్ల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. నేరేడు పండ్లతో పాటు దీని గింజలు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. నేరేడు పండ్ల నుంచి విత్తనాలను తీసి వాటిని కడగాలి. ఎండబెట్టి ఆ విత్తనాలను పొడి చేయండి. ఈ చూర్ణం డయాబెటిస్ బాధితులకు ఓ వరం. షుగర్ పేషెంట్స్ లోని అధిక రక్త చక్కెరను తగ్గించడంలో ఈ పొడి ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ పొడిని ఉదయాన్నే నీటితో కలిపి తీసుకోవచ్చు. అయితే షుగర్ కంట్రోల్ కోసం ఏదైనా ఔషధం తీసుకుంటే.. ఈ పొడిని తీసుకోవద్దు.
అవోకాడో సీడ్ అవోకాడో శారీరక ఆరోగ్యంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది యాంటీఆక్సిడెంట్ల నిధి. అయితే దాని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పని చేస్తాయి. అదే సమయంలో.. ఈ విత్తనాల చూర్ణంతో ఫేస్ ప్యాక్ తయారు చేసి అప్లై చేయవచ్చు.
జాజికాయ మసాలాగా ఉపయోగించే జాజికాయ.. ఇది పండు కెర్నల్ లేదా విత్తనం. ఇది ఫిల్ మిరిస్టికా అనే చెట్టు పండు నుంచి లభిస్తుంది. చెట్టు నుంచి పండిన పండు నుంచి జాజికాయ వేరు చేయబడుతుంది. ఈ పండు నుంచి జాపత్రి కూడా లభిస్తుంది. ఇది విత్తనం అంటే జాజికాయపై ఒక కవర్ లాగా చుట్టబడి ఉంటుంది.
చింత గింజలు పుల్లని రుచిని కలిగి ఉన్న చింతపండు రుచితో పాటు పోషకాహారం కూడా. అయితే చింత గింజలను కూడా ఆరోగ్య సంబంధిత సమస్యల నివారణకు కూడా ఉపయోగిస్తారు. దీని పొడిని తయారు చేసి తీసుకుంటారు. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏ రకమైన విత్తనాలనైనా ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.)