విద్యుత్‌ ఛార్జీలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలపై సీఎం చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్‌ చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యూనిట్‌ విద్యుత్‌ ధర రూ.5.19గా ఉండేదని, దాన్ని రూ.4.90కి తగ్గించామని సీఎం చంద్రబాబు చెప్పారు.


మార్చి నాటికి మరో 10 పైసలు, మూడేళ్లలో రూ.1.19 తగ్గించి యూనిట్‌ రూ.4 కే అందిస్తామన్నారు. 2019 – 24 నాటి ట్రూ అప్‌ ఛార్జీల భారం రూ.4,498 కోట్లను ప్రభుత్వమే భరించే నిర్ణయాన్ని కేబినెట్‌ ఆమోదంలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం గందరగోళ నిర్ణయాలు అమలు చేసిందని సీఎం విమర్శించారు.

అటు తెలంగాణలో విద్యుత్‌ ఛార్జీలపై డిప్యూటీ సీఎం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. విద్యుత్‌ ఛార్జీలను పెంచొంద్దని డిస్కంలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దీంతో పంపిణీ సంస్థలు తమ ఆర్థిక లోటును ప్రభుత్వం ద్వారా పూడ్చుకునేలా ఏఆర్‌ఆర్‌ నివేదికలను సవరించాయి. టీజీఎస్‌పీడీసీఎల్‌ రూ.9,583 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌ రూ.12,521 కోట్ల లోటులో ఉన్నట్టు నివేదిల్లో పేర్కొన్నాయి. ఈ నెల 31 వరకు డిస్కంల నివేదికలపై అభ్యంతరాల స్వీకరణ, మార్చి 5, 7 తేదీల్లో ఈఆర్‌సీ ఆఫీసుల్లో బహిరంగ విచారణ జరిపి టారిఫ్‌ ఆర్డర్‌ను జారీ చేయనున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.