MS Dhoni: ‘సమయం ఆసన్నమైంది’.. ధోని సంచలన పోస్ట్.. ఫ్యూచర్ ప్లాన్స్‌పై క్లారిటీ ఇచ్చేశాడా?

ఐపీఎల్ 17వ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ సర్దుకుంది. కీలక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి 14 పాయింట్లతో ప్లేఆఫ్స్‌లో నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఓటమి కారణంగా చెన్నై ప్లేఆఫ్ కల అసంపూర్తిగా మిగిలిపోయింది. ప్లే ఆఫ్స్ లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మంగళవారం మే 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. మరికాసేపట్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. అంతకు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫేస్‌బుక్‌లో ఓ పెద్ద ప్రకటన చేశాడు. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని మిస్టర్ కూల్ ఫేస్ బుక్ లో 3 వాక్యాలను పోస్ట్ చేశాడు. ‘ విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన సమయం. ముఖ్యమైన పనులు చేయడానికి ఇది అనువైన సమయం. నేను నా సొంత జట్టును ప్రారంభిస్తున్నాను!’ అని ధోని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ధోని ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ ను షేర్ చేశాడు? ఇప్పుడు ధోనీ కొత్త జట్టు ఏది? ఆ జట్టు క్రికెట్‌కు సంబంధించినదా లేక మరేదైనా ఉందా? దీనిపై క్రికెట్ అభిమానులు, ధోనీ అనుచరులు తలలు పట్టుకుంటున్నారు.


గతంలో ధోనీ తీసుకున్న పలు నిర్ణయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. అనూహ్యంగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అలాగే ధోని సోషల్ మీడియా పోస్ట్‌లలో దేనినైనా అలాగే అంచనా వేయడం తప్పు, ఎందుకంటే ధోనీ కూడా అలాంటి పోస్ట్‌ల ద్వారా ప్రమోషన్లు చేస్తున్నాడు. ధోనీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తన సొంత జట్టును ప్రారంభిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఈ జట్టు క్రికెట్‌కు సంబంధించినదా? లేదా ధోని IPLలో జట్టును తీసుకోబోతున్నాడా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు ధోనీ ఇంకేమైనా స్టార్ట్ చేసి తన టీమ్‌ని అక్కడికి తీసుకురావాలనుకుంటున్నాడా? అనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ధోనీ కొత్త జట్టు ఏది? అతను ధోనీ జట్టుకు కెప్టెన్ అవుతాడా లేక మరెవరైనా ఉంటారా? అంటూ అభిమానులు లెక్కలేసుకుంటునన్నారు . అయితే ధోని షేర్ చేసిన ఈ పోస్ట్‌కు అర్థం రానున్న రోజుల్లో తేలిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. అందుకే అందరూ ధోని సోషల్ మీడియా అకౌంట్లపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.

కాగా, ఐపీఎల్ 17వ సీజన్‌కు ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుని రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అందించాడు. రీతురాజ్ నాయకత్వంలో చెన్నై 14 మ్యాచ్‌లకు గాను 7 గెలిచింది. మరో 7 మ్యాచుల్లో పరాజయం పాలై ప్లే ఆఫ్స్ కు చేరకుండానే నిష్ర్కమించింది.