హాట్ టాపిక్ అయిన నాగబాబు ఆస్తుల విలువ! స్థిర, చరాస్తులు కోట్లలో ఉన్నాయి

ఇక మెగా బ్రదర్ నాగబాబు ఇప్పటి వరకు 70 కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించాడట. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో రాఖలు చేశారు నాగబాబు. అంతేకాదు తనపై ఎలాంటి క్రిమినల్‌ కేసులూ లేవని స్పష్టం చేశారు. తన దగ్గర చరాస్తుల రూపంలో 59 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్‌లో కోట్ చేశారు నాగబాబు. అందులో స్థిరాస్తుల మొత్తం విలువ 11.20 కోట్ల మేర వుంటుందంటూ చెప్పారు.