మీ లివర్‌లో కొవ్వు ఉంటే తినాల్సిన ఆహారాలు ఇవే.. లివర్ ఆరోగ్యం కోసం ఇవి తినండి

కాలేయ సమస్యలు అంత త్వరగా బయటపడవు. కానీ బయటపడిసరికి చాలా డ్యామేజ్ జరిగిపోతుంది. పైగా లివర్​కి ఏదైనా ఇబ్బంది వస్తే అది పూర్తి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.


కాబట్టి దానిని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే లివర్​ ఫ్యాట్​తో ఇబ్బంది పడేవారు కొన్ని ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్​ ఇన్​ఫ్లమేషన్​ని దూరం చేస్తాయి. అంతేకాకుండా డీటాక్స్ చేసి ఫ్యాటీ లివర్​ సమస్యని కంట్రోల్ చేస్తాయి.

తృణ ధాన్యాలు

మీ డైట్​లో రైస్​కి బదులు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. గోధుమలతో చేసిన బ్రెడ్, క్వినోవాను డైట్​లో తీసుకోవచ్చు. ఇవి బ్లడ్ షుగర్​ని అదుపులో ఉంచుతాయి. అంతేకాకుండా ఫ్యాట్ పెరగకుండా హెల్ప్ చేస్తాయి. దీనివల్ల ఫ్యాటీ లివర్ సమస్య కంట్రోల్​లో ఉంటుంది.

హెల్తీ ఫ్యాట్స్

శరీరానికి మంచికొవ్వులు అవసరం. కాబట్టి హెల్తీ ఫ్యాట్స్ కోసం నట్స్, సీడ్స్, ఆలివ్ ఆయిల్ వంటివి డైట్​లో తీసుకోవాలి. ఇవి ఇన్​ఫ్లమేషన్​ని కంట్రోల్ చేస్తాయి. మెటబాలీజంను పెంచుతాయి. జీవక్రియ పెరిగితే ఫ్యాట్ బర్న్ అవుతుంది. చెడ్డు కొవ్వు ఎనర్జీగా కన్వెర్ట్ అవుతుంది. ఇది లివర్​ హెల్త్​కి మంచిది.

ఫైబర్ రిచ్ ఫుడ్స్

ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ డైట్​లో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి ఆహారాన్ని సులువుగా జీర్ణమయ్యేలా చేస్తాయి. బ్లడ్ షుగర్​తో పాటు కొలెస్ట్రాల్​ని కంట్రోల్ చేస్తాయి. ఈ రెండూ లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తాయి.

ప్రోబయోటిక్స్

ప్రోబయోటిక్స్ కూడా కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యోగర్ట్, పులియబెట్టిన ఆహారాన్ని తీసుకుంటే లివర్ ఫ్యాట్ కంట్రోల్ అవుతుంది. ఇది లివర్​ ఎంజైమ్ ఫంక్షన్​ని మెరుగుపరచడంలో వండర్స్ చేస్తుంది.

ప్రోటీన్ ఫుడ్

డైట్​లో చేపలు, చికెన్, బీన్స్, పప్పులు వంటివి చేర్చుకోవాలి. ఇవి ప్రోటీన్​ను శరీరానికి అందిస్తాయి. అంతేకాకుండా లివర్​లోని ఫ్యాట్​ని కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అన్​ హెల్తీ ఫుడ్ తినాలన్నా కోరికలను కంట్రోల్ చేస్తుంది.

వెల్లుల్లి

వెల్లిల్లి కూడా లివర్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది. ఇది బరువును, శరీరంలోని కొవ్వును తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఫ్యాటీలివర్​ని తగ్గిస్తుంది కాబట్టి దీనిని కూడా డైట్​లో చేర్చుకుంటే మంచిది.

ఇవేకాకుండా..

వీటితో పాటు ఓమెగా ఫ్యాటీ 3 ఫుడ్స్ తీసుకుంటే ఇన్​ఫ్లేమషన్​ తగ్గుతుంది. ఇది లివర్​లోని ఫ్యాట్​ని తగ్గిస్తుంది. బ్రకోలీ, క్యాబేజి వంటివి డీటాక్స్​ చేయడంలో హెల్ప్ చేస్తాయి. కాలేయ కణాలను కాపాడుతాయి. వీటితో పాటు వైద్యులు ఇచ్చిన మందులు, సూచనలు ఫాలో అవ్వాలి. రెగ్యులర్​గా వ్యాయామం చేస్తూ.. శరీరానికి కావాల్సిన నీటిని అందిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.