ఈ ఛాన్స్ పోతే జీవితంలో మళ్లీ రాదు.. రూ.60కే ఈ రెండు బైక్స్

సామాన్యుడికి అందుబాటు ధరలలో నాణ్యమైన బైక్‌లను అందించడంలో హీరో మోటోకార్ప్ ముందు వరుసలో ఉంటుంది. ఈ మార్చి నెలలో హీరో మోటోకార్ప్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.


ప్రధానంగా, కంపెనీ తన పాపులర్ మోడళ్లైన హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-టెక్, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్‌లపై అదిరిపోయే డిస్కౌంట్లు, తక్కువ ఈఎంఐ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

ఎందుకీ ఆఫర్?
హీరో మోటోకార్ప్ ప్రకటించిన ఈ ఆఫర్, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో తక్కువ ధరలో నాణ్యమైన వాహనాలను కొనాలనుకునేవారికి గొప్ప అవకాశం. ముఖ్యంగా, రోజువారీ అవసరాలకు, తక్కువ దూరం ప్రయాణించేవారికి ఈ బైక్‌లు ఎంతో అనుకూలంగా ఉంటాయి.

ఆఫర్ వివరాలు
కస్టమర్‌లు కొనుగోలుపై 5 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే రోజుకు రూ. 60 ఈఎంఐ చెల్లించి, ఈ బైక్‌లను సొంతం చేసుకోవచ్చు.తక్కువ డౌన్‌పేమెంట్‌తో సులభమైన ఫైనాన్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.ఆఫర్ వివరాలు హీరో మోటోకార్ప్ డీలర్‌షిప్‌లలో పొందవచ్చు.హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ధర రూ. 63,900 నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-టెక్: రూ. 84,351 నుంచి ప్రారంభం అవుతుంది.

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఫీఛర్స్
ఈ బైక్ లో 97.2cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ తో వస్తుంది. ఇది 8.36 పిఎస్ పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఆఫ్షన్ ఉంటుంది. ఈ బైక్ మెటల్ గ్రాబ్ రైల్, బ్లాక్ థీమ్ ఎగ్జాస్ట్ లో వస్తుంది. దీనికి అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లను అందించింది కంపెనీ. 9.1 లీటర్ ఇంధన ట్యాంక్, 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్, ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో వస్తుంది.

హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్-టెక్ ఫీచర్స్
దీనికి ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్ ఇచ్చారు. అలాగే రియల్ టైమ్ మైలేజ్ సమాచారం అందిస్తుంది. బ్లూటూత్, కాల్స్, ఎస్ఎంఎస్, బ్యాటరీ అలర్ట్, 4 స్పీడ్ గేర్‌బాక్స్, లీటరుకు 73 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 6000 కిలోమీటర్ల వరకు సర్వీస్ అవసరం లేదు.

ఈ ఆఫర్లతో హీరో మోటోకార్ప్ మధ్యతరగతి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తక్కువ ధరలో నాణ్యమైన బైక్‌లను కొనాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం.